Home> హెల్త్
Advertisement

Raisin Water Uses: ఎండు ద్రాక్ష నీళ్లు తాగడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

Health Benefits Of Raisin Water: ఎండు ద్రాక్ష నీరు ఒక రకమైన ఆరోగ్యకరమైన పానీయం. దీనిని ఎండు ద్రాక్షను నానబెట్టి తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.  

 Raisin Water Uses: ఎండు ద్రాక్ష నీళ్లు తాగడం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

Health Benefits Of Raisin Water: అధిక బరువు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. వెయిట్ లాస్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, డైట్, జిమ్ వంటివి సహాయపడతాయి. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు కూడా బరువు తగ్గడానికి మంచివి. ఎండు ద్రాక్ష నీరు ఒక అద్భుతమైన పానీయం. ఇది వెయిట్ లాస్ కి చాలా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఎండు ద్రాక్ష నీరు తాగుతూ, మంచి డైట్ ను పాటిస్తూ, వ్యాయామం చేస్తే కేవలం 10 రోజుల్లోనే మీరు శరీరంలో మార్పును గమనించవచ్చు. వెయిట్‌ లాస్‌ మాత్రమే కాకుండా దీంతో మరి కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

మనం రోజువారీ జీవితంలో ఎదురయ్యే కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల శరీరంలోకి మలినాలు చేరతాయి. ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల ఈ మలినాలు బయటకు వెళ్లిపోతాయి, శరీరం లోపలి నుండి శుభ్రమవుతుంది. అంతేకాకుండా ఎండు ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్లే ముసలితనం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఈ ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది, నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం జీర్ణక్రియ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

ఎండుద్రాక్ష నీరు అనేది ఒక ఆరోగ్యకరమైన పానీయం ఇవి శరీరంలో ద్రవాల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి. చెమట ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి సహాయపడుతాయి. నాడీ వ్యవస్థ, కండరాల పనితీరును మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఈ అద్భుతమైన ఎండుద్రాక్ష నీరు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష నీటిని ఎలా తయారు చేయాలి:

రాత్రిపూట ఒక గిన్నెలో 3-4 ఎండుద్రాక్షలను నానబెట్టండి. ఉదయాన్నే, నానబెట్టిన ఎండుద్రాక్షలను నీటితో సహా తాగండి. రుచి కోసం, మీరు నీటిలో నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. ఎండుద్రాక్ష నీటిని రోజువారీగా తాగడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక:

ఎండు ద్రాక్షలను ఎక్కువగా తినకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ పానీయాన్ని తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More