Home> హెల్త్
Advertisement

Cinnamon On Empty Stomach: చిటికెడు దాల్చినచెక్క పొడి పరగడుపున తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా?

Pinch Of Cinnamon On Empty Stomach: దాల్చిన చెక్క పొడిని మనం నేచురల్‌ ఇన్సూలిన్‌లా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రీడయాబెటీస్‌, టైప్‌ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు ప్రతిరోజూ పరగడుపున చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు. షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది.

Cinnamon On Empty Stomach: చిటికెడు దాల్చినచెక్క పొడి పరగడుపున తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా?

Pinch Of Cinnamon On Empty Stomach: దాల్చిన చెక్క పొడి మన ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. ఇది నేచురల్‌ ఇన్సూలిన్‌ మాదిరి పనిచేస్తుంది. సాధారణంగా మనం దాల్చిన చెక్కను ఆహారానికి రుచిని పెంచడానికి వేసుకుంటారు. ముఖ్యంగా బిర్యానీ, బగారా రైస్‌ వంటి మసాలా వంటకాల్లో విపరీతంగా వినియోగిస్తారు. ఎన్నో ఏళ్లుగా దాల్చిన చెక్క వివిధ భారతీయ వంటల్లో వినియోగిస్తారు. అంతేకాదు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో మెడిసినల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్‌తో బాధపడేవారు దాల్చిన చెక్కను తీసుకోవాలి. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బిర్యానీ రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం.

బ్లడ్‌ షుగర్‌.. 
దాల్చిన చెక్క పొడిని మనం నేచురల్‌ ఇన్సూలిన్‌లా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ప్రీడయాబెటీస్‌, టైప్‌ 2 డయాబెటీస్‌తో బాధపడేవారు ప్రతిరోజూ పరగడుపున చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు. షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది.

మంట సమస్య తగ్గిస్తుంది..
దాల్చిన చెక్క పొడిలో యాంటీ ఇన్ల్ఫమేషన్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆర్థ్రరైటీస్‌ సమస్యలు తగ్గుతాయి. దీంతో ఎక్కువ కాలంపాటు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

గుండె ఆరోగ్యం..
దాల్చిన చెక్క రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు దాల్చిన చెక్క పొడిని పరగడుపున తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు చేస్తుంది.

ఇదీ చదవండి: కడుపు ఆరోగ్యాన్ని పాడు చేసే 8 ఆహారాలు.. కచ్చితంగా వీటికి దూరంగా ఉండాల్సిందే..

మెమొరీ బూస్ట్‌..
దాల్చిన చెక్క పొడి మెదడు పనితీరుకు ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ఈ పొడి ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మెదడు సెల్స్‌ ను రక్షిస్తుంది.

జీర్ణక్రియ..
దాల్చిన చెక్క కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కడుపులో చెడు బ్యాక్టిరియా పెరగకుండా నివారిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. దాల్చిన చెక్కను పొడి చేసుకుని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. శరీర ఆరోగ్యానికి బూస్టింగ్‌ ఇస్తుంది.  దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజూ పరగడుపున ఒక చిటికెడు తీసుకుంటే ఇన్ని అద్భుతమైన ఆరోగ్య  ప్రయోజనాలు పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ఇదీ చదవండి:  ఉడకబెట్టిన పల్లీలు పిడికెడు ప్రతిరోజు తింటే మీ శరీరంలో జరిగే ఈ మ్యాజిక్ తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More