Home> హెల్త్
Advertisement

Muskmelon Benefits: వేసవిలో కర్భూజ తింటే వడదెబ్బకు చెక్, గుండెకు సైతం ప్రయోజనం

Muskmelon Benefits: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు తాగడం శ్రేయస్కరం. తాగునీటిని వరుస విరామాలలో తీసుకున్నా డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. అదే సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు తాగడంతో పాటు కర్బూజ లాంటివి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Muskmelon Benefits: వేసవిలో కర్భూజ తింటే వడదెబ్బకు చెక్, గుండెకు సైతం ప్రయోజనం

Muskmelon Benefits: వేసవి కాలం వచ్చిందంటే ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ ఆరంభానికి ముందే పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. మరోవైపు కరోనా లాంటి మహమ్మారి ప్రజలుతోంది. విపరీతంగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కనుక రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు తాగడం శ్రేయస్కరం. తాగునీటిని వరుస విరామాలలో తీసుకున్నా డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. అదే సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు తాగడంతో పాటు కర్బూజ లాంటివి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వేసవితాపం నుంచి ఉపశనమం కలుగుతుంది. వడదెబ్బ(Summer Tips) బారిన పకుండా ఉండాలంటే నిమ్మరసం లాంటివి తాగాలి.

Also Read: Cucumber Benefits: సమ్మర్‌లో కీరదోస తింటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

కర్భూజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
- వేసవి కాలంలో మన శరీరంలో నీటి శాతాన్ని పెంచే పండ్లు, పదార్థాలలో కర్భూజ ఒకటి.

- కర్భూజలో విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు సోడియం, కాల్షియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, ఫైబర్‌, జింక్‌ లాంటి పోషకాలు మనకు అందుతాయి.

- కర్భూజను తిన్నా, లేదా జూస్ తాగినా వేసవితాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుతుంది.

Also Read: Benefits Of Kiwi Fruit: కివి పండు తింటే రక్తం గడ్డకట్టదు, మరెన్నో ప్రయోజనాలు మీకు తెలుసా

- వేసవి కాలంలో కర్భూజను తినడం వల్ల కంటిపై ఎండ ఒత్తిడి తగ్గుతుంది. చర్మం(Skin Care) పొడిబారకుండా కర్భూజ ఉపయోగపడుతుంది.

- ఇందులో నీటిశాతం అధికంగా ఉంటుంది. కనుక వేసివిలో కర్భూజ తింటే డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. తద్వారా వడదెబ్బ బారిన పడకుండా మనల్ని సంరక్షిస్తుంది.
 
- వేసవిలో రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండె సంబంధిత జబ్బుల బారిన పడకుండా ఉంటాం.

Also Read: COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More