Home> హెల్త్
Advertisement

Mountain Vegetables: వీటిని తినడం వల్ల ఆ వ్యాధులు దూరమవుతాయి..!

Mountain Vegetables: ప్రకృతిలో అందమైనవి పర్వతాలు.. ఈ కొండ పర్వతాలలో వివిధ రకాల జాతుల జంతువులు, మొక్కలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉండే పలు రకాల చెట్ల ద్వారా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.

 Mountain Vegetables: వీటిని తినడం వల్ల ఆ వ్యాధులు దూరమవుతాయి..!

Mountain Vegetables: ప్రకృతిలో అందమైనవి పర్వతాలు.. ఈ కొండ పర్వతాలలో వివిధ రకాల జాతుల జంతువులు, మొక్కలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉండే పలు రకాల చెట్ల ద్వారా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఈ గాలిని పీల్చుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రంలో వర్ణించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో లభించే  వివిధ రకాల కూరగాయలు మానవ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని శాస్త్రం పేర్కొంది. 

ప్రస్తుతం ఈ కూరగాయాలు అన్ని పట్టణాల్లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ యుగంలో వీటిని కొనడం ఇప్పుడు చాలా సులభమైంది. గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌ చెందిన ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ ఈ కూరగాయల గురించి ఈ విధంగా వివరించారు.

ఈ కూరగాయలు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి.

1. బురాన్ష్ పువ్వులు (Rhododendron) 

బురాన్ష్ పువ్వులు ఆయుర్వేదం యొక్క నిధిగా పెద్దలు చెప్పుకుంటారు. ఇందులో ఐరన్‌, కాల్షియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి పొట్టకు సంబంధించిన రుగ్మతాలను తొలగించడానికి సహాయపడతాయి. ఈ పువ్వులను  కూరగా వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే దీనిని షర్బట్, చట్నీ రూపంలో తినవచ్చు.

2. లంకు (Chayote) 

గుండె ఆరోగ్యానికి అద్భుతమైనదిగా భావించే కూరగాయలలో లంకు (కొండ ప్రాంతాల్లో లభించే కూరగాలు)  ఒకటి. దీన్ని తినడం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలున్నాయని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ కూరగాయలను తినడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

3. లింగ్డి (Fiddlehead) 

లింగ్డీలో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు, ఆమ్లాలు, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీనిని పర్వతాలలో 'కస్రోడ్' అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణక్రియకు మేరుగుపరిచి దృఢంగా చేస్తుంది. 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Read also: Curd & Milk for Weight Loss: బరువు తగ్గే క్రమంలో పాలు, పెరుగు తాగడం మంచిదేనా..!

Read also: Chittoor: చిత్తూరులో అర్ధరాత్రి హైడ్రామా..  మాజీ మేయర్ హేమలతను ఢీకొట్టిన పోలీస్ జీపు..? గాయాలతో ఆసుపత్రిలో చేరిక    

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More