Home> హెల్త్
Advertisement

Weight Loss Drink: సింపుల్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ రసం తాగండి చాలు!


Miracle Weight Loss Drink: ప్రతి రోజు దోసకాయ రసం తాగడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Weight Loss Drink: సింపుల్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ రసం తాగండి చాలు!

 

Weight Loss Drink: దోసకాయలో 96% నీరు ఉంటుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే నీటిని శాతం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంతో పాటు ఇందులో  విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే దోసకాయను జ్యూస్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రసాన్ని ఉదయాన్నే తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇవే కాకుండా ఇంకా శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

దోసకాయ రసం తాగడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ప్రయోజనాలు:
1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

దోసకాయలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల దీని రసం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. ఇందులోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనుభూతిని కలగజేస్తుంది. దీంతో పాటు ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, 12 వారాల పాటు రోజుకు ఒక గ్లాసు దోసకాయ రసం తాగిడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని తెలింది. దీంతో పాటు కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది. 

2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
దోసకాయలోని రసంలో ఉండే హై ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ప్రతి రోజు రెండు గ్లాసుల రసం తాగడం వల్ల పొట్ట సమస్యలు శాశ్వతంగా తగ్గుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 

3. రక్తపోటును నియంత్రిస్తుంది:
దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు, దోసకాయ రసం తాగడం వల్ల వారి రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. తరచుగా అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది. 

4. చర్మానికి మేలు చేస్తుంది:
దోసకాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవలే అధ్యయాల్లో తెలిపిన వివరాల ప్రకారం, మొటిమలు ఉన్న వ్యక్తులు, రోజుకు ఒక గ్లాసు దోసకాయ రసం తాగిన తర్వాత, వారి మొటిమలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
దోసకాయలో విటమిన్ సి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More