Home> హెల్త్
Advertisement

Winter Special Tea: చలికాలం అనారోగ్య సమస్యలు దూరం చేసే అద్భుతమైన మసాలా టీ ఇదే

Winter Special Tea: చలికాలం ప్రారంభమైపోయింది. చలికాలంలో సహజంగానే ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వెంటాడుతాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎలా..
 

Winter Special Tea: చలికాలం అనారోగ్య సమస్యలు దూరం చేసే అద్భుతమైన మసాలా టీ ఇదే

చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని రకాల మసాలా దినుసులు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రత్యేకించి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతుంటాయి. అయితే అద్భుతమైన మాసాలా టీతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

దేశవ్యాప్తంగా చలికాలం ప్రారంభమై..చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. చలికాలంలో ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తాయి. ఫంగస్, బ్యాక్టీరియా పెరగడం వల్ల రకరకాల వ్యాధులు తలెత్తుతాయి. చలికాలంలో ఇమ్యూనిటీ బలహీనమవడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు అధికమౌతాయి. ఈ పరిస్థితుల్లో మసాలా టీ అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. శరీరానికి చాలా మేలు చేకూరుతుంది. మసాలా టీ సాధారణ టీతో పోలిస్తే చాలా ప్రయోజనకరం. మసాలా టీతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.

మసాలా టీ ఎలా తయారు చేయాలి

మసాలా టీలో చాలా రకాల మూలికలు, వేర్లు ఉపయోగిస్తారు. ఇందులో సాధారణ టీ కంటే ఎక్కువ పదార్ధాలు కలుపుతారు. ఇందులో టీ పొడితో పాటు తులసి ఆకులు, లవంగం, అల్లం, ఇలాచీ, దాల్చినచెక్క మిశ్రమ పౌడర్ వేయాలి. ఈ మసాలా టీ తాగడం వల్ల మీ అలసట దూరమౌతుంది. తక్షణ ఎనర్జీ లభిస్తుంది. ఇది తాగడం వల్ల శరీరంలో స్వెల్లింగ్ దూరమౌతుంది. మసాలా టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగం.

మసాలా టీ ప్రయోజనాలు

మసాలీ టీలో ఉండే అల్లం, దాల్చినచెక్క, ఇలాచీలో యాంటీ ఆక్సిడెంట్లు , ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. కేన్సర్ ముప్పు కూడా తగ్గతుంది. ప్రతిరోజూ మసాలా టీ తాగడం వల్ల కేన్సర్ వ్యాధితో పోరాడే సామర్ద్యం కలుగుతుంది. మసాలా టీతో జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలోని హార్మోన్స్ నియంత్రణలో ఉంటాయి. 

Also read: Black Cumin Seeds: పెరుగుతున్న కొవ్వు కరిగించే అద్భుత ఔషధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More