Home> హెల్త్
Advertisement

Malaria Home Remedies: పెరుగుతున్న మలేరియా ముప్పు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

Malaria Home Remedies: వాతావరణం మారుతూనే పలు వ్యాధుల ప్రభావం పెరుగుతుంటుంది. ఇందులో మలేరియా అత్యంత ప్రమాదకరమైంది. మలేరియా నుంచి ఎలా సంరక్షించుకోవాలే తెలుసుకుందాం..
 

Malaria Home Remedies: పెరుగుతున్న మలేరియా ముప్పు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు

Malaria Home Remedies: వాతావరణం మారుతూనే పలు వ్యాధుల ప్రభావం పెరుగుతుంటుంది. ఇందులో మలేరియా అత్యంత ప్రమాదకరమైంది. మలేరియా నుంచి ఎలా సంరక్షించుకోవాలే తెలుసుకుందాం..

వర్షాకాలం, చలికాలంలో వ్యాధుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆసుపత్రులు రోగులతో నిండిపోయి కన్పిస్తాయి. వర్షాకాలం-చలికాలంలో ప్రధానంగా కన్పించే వ్యాధులు డెంగ్యూ-మలేరియా. ఈ రెండూ దోమకాటుతో వచ్చేవే. మలేరియా వ్యాధి అనేది మగ ఎన్ఫిలిస్ దోమ కారణంగా వస్తుంది. ఇది కుట్టడం వల్ల శరీలంలో మలేరియా పరాన్నజీవి ప్రవేశిస్తుంది. రక్తంతో వేగంతో కలిసిపోయి..లివర్‌కు చేరగానే ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మలేరియా నియంత్రణ సాధ్యమే. మలేరియా నియంత్రణకు పాటించాల్సిన హోమ్ రెమిడీస్ ఇవీ..

మలేరియా లక్షణాలేంటి

తలనొప్పి, జ్వరం, చలి, కడుపులో నొప్పి, వాంతులు, ఎనీమియా, అజీర్ణం ప్రధాన లక్షణాలు. మలేరియా లక్షణాలు 10-15 రోజుల్లో ప్రభావం చూపిస్తాయి. మీ శరీరంలో ఈ లక్షణాల్లో ఏమున్నా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

మలేరియా సోకినప్పుడు పులుపు పండ్లను డైట్‌లో భాగంగా చేసుకోవాలి. పులుపు పండ్లు వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి జ్వరాన్ని నియంత్రిస్తుంది. దాంతోపాటు సంక్రమణ కాకుండా నియంత్రిస్తుంది. ఇందులో ద్రాక్ష, నారింజ, నిమ్మకాయ, బ్లాక్ బెర్రీ వంటివి చాలా మంచిది. అల్లం కూడా ప్రయోజనకరం. దీనికోసం అల్లంను నీళ్లతో ఉడికించి ఆ రసం తాగాలి. అల్లంలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి, వోమిటింగ్ సెన్సేషన్ తగ్గిస్తాయి.

పసుపు, దాల్చిన చెక్కతో..

యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంే పసుపు..శరీరం నుంచి విష పదార్ధాల్ని బయటకు తొలగిస్తుంది. మలేరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మజిల్స్ , జాయింట్ పెయిన్స్ తగ్గిస్తాయి. యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా కలిగిన దాల్చిన చెక్క ఇందుకు చాలా బాగా దోహదపడుతుంది. మలేరియా కారణంగా తలెత్తే వీక్నెస్ దూరం చేస్తుంది. 

Also read: Diabetes Control Tips: తేనె, వెల్లుల్లిని కలిపి తీసుకుంటే చాలు.. మధుమేహం, గుండె సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More