Home> హెల్త్
Advertisement

Maida Flour Facts: మైదాతో చేసిన ఆహారాలు అతిగా తింటున్నారా? హాస్పిటల్‌కి డబ్బులు సిద్ధం చేసుకోండి!

Maida Flour Facts: మైదా పిండితో చేసిన ఆహారాలు అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మందిలో దీనితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Maida Flour Facts: మైదాతో చేసిన ఆహారాలు అతిగా తింటున్నారా? హాస్పిటల్‌కి డబ్బులు సిద్ధం చేసుకోండి!

 

Maida Flour Facts In Telugu: మైదా పిండితో తయారు చేసిన ఆహారాలంటే మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది వీటిని కొనుగోలు చేసి తింటున్నారు. నిజానికి మైదా చేసిన ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో వీటితో తయారు చేసిన ఆహారాలు తింటే అనేక రకాల పొట్ట సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీసే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ పిండితో చేసిన ఆహారాలకు దూరంగా ఉండడమే మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మైదా పిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

మైదా పిండితో తయారు చేసిన ఆహారాలు తింటే కలిగే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు: 

ప్రస్తుతం చాలా మంది మైదా తయారు చేసిన ఆహారాలు అతిగా తినడం వల్లే పొట్ట సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. ఈ పిండిలో ఉండే రసాయనాలు జీర్ణక్రియకు ఆంతరాయం కలిగిస్తాయి. దీని కారణంగా మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్‌ వంటి సమస్యలకు దారీ తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాల ఇతర పొట్ట దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీస్తాయి. 

బరువు పెరుగుదల: 
మైదాలో కేలరీలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు అతిగా తినడం వల్ల సులభంగా బరువు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ పిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల గుండె సమస్యలు కూడా రావచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం: 
మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎంతో సులభంగా పెంచుతుంది. దీని కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు సమస్యల ప్రమాదం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఇవే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారీ తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

గుండె సమస్యలు: 
మైదాలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది రక్తనాళాలకు అడ్డుపడి గుండె సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర ప్రమాదాలను కూడా పెంచుతుంది.

ఎముకలు బలహీనపడటం: 
మైదాలో కాల్షియం తక్కువగా ఉంటుంది. అయితే ఈ పిండితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తింటే ఎముకలు బలహీనపడతాయి. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More