Home> హెల్త్
Advertisement

How To Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారు.. ఈ పండ్లను తింటే చాలు..

Ldl Cholesterol Reducing With Fruits: హ్యూమన్ బాడీ లో రక్తంలోని లిపోప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యను రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్లనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

How To Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారు.. ఈ పండ్లను తింటే చాలు..

Ldl Cholesterol Reducing With Fruits: హ్యూమన్ బాడీ లో రక్తంలోని లిపోప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యను రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్లనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యలను నివారించడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కూడా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆహారంలో పండ్లను తీసుకోవడం వంటి నియమాలు తప్పనిసరి. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని రకాల పడ్లు సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏ పండ్లను తినాలి..?
వీధుల్లో లభించే అనారోగ్యకరమైన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్న ఆహారాలు, అతిగా మద్యం సేవించడం వీటిని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

1. సిట్రస్ పండ్లు:
ఈ ఫ్రూట్స్ లో విటమిన్ సి, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సులభంగా కరిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ల పరిమాణం ఎక్కువ.. కాబట్టి శరీరంలో వ్యాధులను సులభంగా తగ్గిస్తుంది.

2. నేరేడు పండ్లు:
ఈ పనులలో కూడా శరీరాన్ని కావలసిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి గుండె సమస్యలు రాకుండా సహాయపడతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా నేరేడు పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3. అరటి పండ్లు:
అరటిపండ్లలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి వీటిని రోజు తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాలను సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో గ్లూకోజ్ పరిమాణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఈ అరటి పనులను రోజు ఉదయం పూట తీసుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Read More