Home> హెల్త్
Advertisement

Weight Loss Tips: కలోంజీ సీడ్స్‌ను ఇలా వినియోగిస్తే.. కేవలం 10 రోజుల్లో బరువు తగ్గుతారు..

Kalonji Seeds For Weight Loss: బరువు తగ్గడానికి చాలా చిట్కాలున్నప్పడికి ఇది ఉత్తమమైన చిట్కాగా భావించవచ్చు. కలోంజీ సీడ్స్ పౌడర్ గా చేసుకొని నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

Weight Loss Tips: కలోంజీ సీడ్స్‌ను ఇలా వినియోగిస్తే.. కేవలం 10 రోజుల్లో బరువు తగ్గుతారు..

Kalonji Seeds For Weight Loss: బరువు పెరిగిన ప్రతి ఒక్కరూ స్లిమ్ గా కనిపించాలని బరువు తగ్గడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ బరువు తగ్గలేక పోతారు. అయితే బరువు తగ్గడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా  కొన్ని హోమ్ రెమెడీస్‌ని కూడా పాటించాల్సి ఉంటుంది. ఇలా పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కలోంజీ సీడ్స్:
శరీర బరువు అధికంగా పెరిగితే తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది అంతే కాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి కలోంజి పౌడర్ ఆహారంలో వినియోగిస్తే సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

కలోంజీ పౌడర్ ను ఎలా వినియోగించాలి:
బరువు తగ్గడానికి వ్యాయామం చేసే క్రమంలో ఈ కలోంజీ పౌడర్ ని వినియోగించవచ్చు. దీనికోసం గోరువెచ్చగా వేడి చేసిన అర గ్లాసు నీటిని తీసుకొని అందులో చిటికెడు కలోంజీ పొడిని కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక చెంచా తేనె.. ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో ఎందుకు తాగాలో తెలుసా..?:
ఇలా తయారు చేసుకున్న కలోంజీ గింజల రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అది మీ శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణం క్రమంగా తగ్గించి.. బరువును తగ్గించడానికి ప్రభావంతంగా కృషి చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కాను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Mistakes in God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈ తప్పులని మీరు గమనించారా?

Also Read: Godfather Day 4 Collections: ఊపందుకున్న గాడ్ ఫాదర్.. మూడో రోజు కంటే పెరిగిన వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More