Home> హెల్త్
Advertisement

Juice For Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగించే కూరగాయల జ్యూస్‌లు ఇవే, కేవలం 7 రోజుల్లో చెక్‌..

How To Reduce Cholesterol In 7 Days: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. 
 

Juice For Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగించే కూరగాయల జ్యూస్‌లు ఇవే, కేవలం 7 రోజుల్లో చెక్‌..

How To Reduce Cholesterol In 7 Days: ప్రపంచ వ్యాప్తంగా కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారి సంఖ్యంగా క్రమంగా పెరుగుతోంది. ఇంతకుముందు ఈ సమస్య 40 ఏళ్ల వయసు గల వారిలో వచ్చేది..కానీ ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే  అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, గుండె దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ఛాన్స్‌ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తాగాల్సి ఉంటుంది. ఆ జ్యూస్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

కొలెస్ట్రాల్ చెక్‌ పెట్టే ఈ జ్యూస్‌ ప్రతి రోజు తాగండి:
1. సోరకాయ రసం:

సోరకాయలు అన్ని కాలాల్లో మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. వీటిని ఎక్కువగా సాంబర్‌లో వినియోగిస్తూ ఉంటారు. ఇందులో  కేలరీలు చాలా తక్కువగా పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల రక్తంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.

Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  

2. బీట్‌రూట్ జ్యూస్:
చాలా మంది అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని బీట్‌రూట్‌ జ్యూస్‌ను తీసుకుంటున్నారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బీట్‌రూట్‌ను సలాడ్స్‌తో పాటు జ్యూస్‌లా తీసుకోవడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో విటమిన్ బి, ఫాస్పరస్‌ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది. 

3. కాకరకాయ రసం జ్యూస్‌:
కాకరకాయలను చేదుగా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక మోతాదులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్ లభిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కాకరకాయ రసాన్ని తాగడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More