Home> హెల్త్
Advertisement

Vaccine Efficacy: పడిపోతున్న అంతర్జాతీయ వ్యాక్సిన్ల సామర్ధ్యం, బూస్టర్ డోసుపై పెరుగుతున్న ప్రాధాన్యత

Vaccine Efficacy: అంతర్జాతీయ వ్యాక్సిన్ లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాకిన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తాజాగా వెల్లడైన ఈ విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
 

Vaccine Efficacy: పడిపోతున్న అంతర్జాతీయ వ్యాక్సిన్ల సామర్ధ్యం, బూస్టర్ డోసుపై పెరుగుతున్న ప్రాధాన్యత

Vaccine Efficacy: అంతర్జాతీయ వ్యాక్సిన్ లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాకిన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో తాజాగా వెల్లడైన ఈ విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి.

కరోనా మహమ్మారి(Corona Pandemic) నియంత్రణకై ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లతో పాటు దేశీయంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల గురించి వెల్లడైన తాజా విషయాలు ఆందోళన కల్గిస్తున్నాయి. 

ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల సామర్ద్యం(vaccine Efficacy) ఆరు నెలల్లో తగ్గిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత 5-6 వారాల్లో ఆ వ్యాక్సిన్ సామర్ధ్యం 88 నుంచి 74 శాతానికి పడిపోయినట్టు బ్రిటన్ కు చెందిన జోయి కోవిడ్ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్ధ్యం నాలుగైదు నెలల్లోనే 77 నుంచి 67 శాతానికి పడిపోయినట్టు విశ్లేషించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్(Covishield)పేరుతో ఉత్పత్తి చేస్తోంది. 12 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి డేటా ఆధారంగా అధ్యయనం నిర్వహించారు. అంతకుముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్ధ్యం ఆరు నెలల్నించి ఏడాది వరకూ ఉండవచ్చని తేలింది. వృద్ధులు, ఆరోగ్యరంగంలో పనిచేస్తున్నవారిలో అయితే 50 శాతానికి పడిపోవచ్చని తేలింది. ఓ వైపు వ్యాక్సిన్ సామర్ద్యం పడిపోతుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తం కావల్సిన అవసరముందని అధ్యయనం స్పష్టం చేసింది. తాజా అధ్యయనం నేపధ్యంలో కొంత విరామం తరువాత కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు(Vaccine Booster Dose)ఇవ్వాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టమైందని తెలుస్తోంది. 

Also read: Health Tips for cold and cough: వర్షా కాలంలో జలుబు, దగ్గుకు ఇలా చెక్ పెట్టండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More