Home> హెల్త్
Advertisement

Improve Iron Levels: శీతాకాలంలో ఐరన్‌ లోపం నుంచి ఇలా సులభంగా ఉపశమనం పొందడి..

Foods That Improve Iron Levels: ప్రతి రోజు బీట్‌రూట్, క్యారెట్, నువ్వుల లడ్డూలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

Improve Iron Levels: శీతాకాలంలో ఐరన్‌ లోపం నుంచి ఇలా సులభంగా ఉపశమనం పొందడి..

Foods That Improve Iron Level: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్స్‌, కాల్షియం, విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే  రక్త హీతన, శరీర బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు ఐరన్‌ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం చాలా మంది ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అలసట వంటి సమస్యలకు లోనవుతారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీంలోని ఐరన్‌ పరిమాణాలను పెంచే ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.

ఐరన్‌ని పెంచే ఆహారాలు:
బీట్‌రూట్, క్యారెట్:

బీట్‌రూట్, క్యారెట్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో పాటు ఇందులో విటమిన్ సితో పాటు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని రెండిటినీ మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల ఐరస్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఐరన్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బీట్‌రూట్, క్యారెట్ రసాన్ని తాగాల్సి ఉంటుంది. 

నువ్వుల లడ్డూలు:
నువ్వుల లడ్డూల్లో ఐరన్‌, రాగి, జింక్, సెలీనియం, విటమిన్ బి6, ఫోలేట్, పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ లడ్డులను తినడం వల్ల శరీరంలోని ఐరన్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే నువ్వుల లడ్డూల్లో  తేనె, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

ఖర్జూరం, అంజీర్‌, ఎండుద్రాక్షలు:
ఈ మూడింటిల్లో  ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఎ, సి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని మూడింటిని మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఐరన్‌ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

దానిమ్మపండు:
దానిమ్మలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని ఐరన్‌ లోపం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More