Home> హెల్త్
Advertisement

Constipation Relief: ఈ పాలు తాగితే రాత్రికి రాత్రే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టొచ్చు.


Constipation Relief: మలబద్దకం సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు పాలలో ఇలా నెయ్యిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 
 

 Constipation Relief: ఈ పాలు తాగితే రాత్రికి రాత్రే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Constipation Relief: ప్రతిరోజు పోషకాలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవడం వల్లే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆహారాలతో పాటు తప్పకుండా ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే పదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే చాలామంది పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు. ఆధునిక జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలామంది వేయించిన స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని కారణంగా మలబద్ధకం సమస్య బారిన పడుతున్నారు.

మలబద్ధకం సమస్య బారిన పెద్దవారే కాకుండా ప్రస్తుతం చిన్నపిల్లలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో పోషకాలలోపం కారణంగా శారీరక సమస్యలు పెరిగి.. పొట్ట సమస్యలైనా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా మలబద్దకం కారణం గా చాలా మందిలో నిద్ర లేకపోవడం, జుట్టు రాలడం, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేదనలు సూచించిన పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. 

Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా

బ్యూట్రిక్ యాసిడ్ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల సులభంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యంగా చెబుతున్నారు. దీనికోసం ప్రతిరోజు వేడిపాలలో నెయ్యిని కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో బ్యూట్రిక్ యాసిడ్స్ లభిస్తాయి కాబట్టి సులభంగా మలబద్ధకం నుంచి పూర్త  ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ రెండు మిస్ చేసిన పాలను ప్రతిరోజు తాగడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వేసవిలో రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో రెండు టీ స్పూన్ల నెయ్యిని కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా నిద్రపోయే కంటే ముందు తాగడం వల్ల ఉదయాన్నే మంచి ఫలితాలు లభిస్తాయి. తరచుగా పొట్టలో మంట, వాపు సమస్యలతో బాధపడే వారు కూడా పాలలో నెయ్యిని కలుపుకొని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More