Home> హెల్త్
Advertisement

How To Control Diabetes: క్యారెట్‌ జ్యూస్‌ కంటి సమస్యలే కాకుండా, మధుమేహానికి కూడా చెక్‌ పెట్టొచ్చు!

Carrot Juice For Diabetes: క్యారెట్‌ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం కాబట్టి సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించి మధుమేహాన్ని తగ్గిస్తుంది.

How To Control Diabetes: క్యారెట్‌ జ్యూస్‌ కంటి సమస్యలే కాకుండా, మధుమేహానికి కూడా చెక్‌ పెట్టొచ్చు!

Carrot Juice For Diabetes: మానవ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు, కూరగాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వాటితో తయారు చేసిన రసాలను తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా క్యారెట్‌తో తయారు చేసిన జ్యూస్ ప్రతి రోజూ తాగితే ఆరోగ్య చాలా రకాల ప్రోటీన్స్‌ లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గించేందుకు ఈ జ్యూస్‌ ప్రభావవంతంగా సహాయపడుతుంది.

క్యారెట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తినడం వల్ల కేలరీలు కూడా పెరగవు. క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే లుటిన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్ పిగ్మెంట్లను శరీరంలోకి విడుదల చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే క్యారెట్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
క్యారెట్ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1.కళ్లకు మేలు చేస్తుంది:

క్యారెట్‌లో ఉండే అనేక ముఖ్యమైన పోషకాలు కళ్ళకు చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. క్యారెట్ జ్యూస్‌లో కళ్లకు అవసరమైన  విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి హానికరమైన కాంతి నుంచి కళ్లను రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల 'మాక్యులార్ డీజెనరేషన్ అనే వ్యాధి' రిస్క్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ జ్యూస్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

2.రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది:
కోవిడ్‌ కారణంగా చాలా మంది రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్‌ తాగాల్సి ఉంటుంది. జ్యూస్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. క్యారెట్‌ రసం ప్రతి రోజూ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా నివారిస్తుంది. రోగనిరోధక శక్తి సమస్యలు కూడా దూరమవుతాయి.

3.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది:
మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అయితే క్యారెట్‌లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తుంది.

ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?

ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More