Home> హెల్త్
Advertisement

Best Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు ఆహార పదార్ధాలు.

Best Immunity Food: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా  ఇంకా భయపెడుతూనే ఉంది. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు తరుముకొస్తోంది. ఈ క్రమంలో శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం.

Best Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు ఆహార పదార్ధాలు.

Best Immunity Food: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా  ఇంకా భయపెడుతూనే ఉంది. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు తరుముకొస్తోంది. ఈ క్రమంలో శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం.

కోవిడ్ మహమ్మారి నియంత్రణలో రాకముందే ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిని కూడా ఒమిక్రాన్ వేరియంట్ వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యూకేలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తిని(Immunity Power)పెంచుకోవడమే కరోనా నియంత్రణకు అత్యుత్యమ మార్గం. రోజూ తినే ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే కరోనా వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఆ ఆహారపు అలవాట్లేవే ఇప్పుడు పరిశీలిద్దాం.

నిత్యం మీరు తినే ఆహారంలో పోషక పదార్ధాలు మెండుగా ఉండేట్టు చూసుకోవాలి, ముఖ్యంగా విటమిన్ సి(Vitain C), జింక్ తప్పనిసరి. అందుకే నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటి ఆక్సిడెంట్లతో పాటు మంచి పోషకాలుంటాయి(Best Food to improve immunity). కోవిడ్ వైరస్ నియంత్రణకు మంచి ఆహారం ఇది. ఎందుకంటే వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

మరో బలవర్ధకమైన ఆహారం, రోగ నిరోధక శక్తిని పెంచేవి రాగులు , ఓట్స్. ఇందులో ఫైబర్, విటమిన్ బి, సంక్లిష్ట పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు రోజూ ఒక గుడ్డు తప్పకుండా తినాల్సిందే. ఇక అన్నిరకాల పోషక పదార్ధాలు, బలమైన ఆహారంగా కిచిడీ చాలా మంచిది. ఇందులో ఉండే పప్పులు, అన్నం, కూరగాయలు, కాసింత గరం మసాలా రోగ నిరోధక శక్తిని అమాంతంగా పెంచుతుంది. బలమైన ఆహారంగానే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది కూడా.

ఇక నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. హైడ్రేషన్ సమస్య తలెత్తదు. ముఖ్యంగా కొబ్బరి నీరు, నిమ్మరసం, హెర్బల్ టీ, ఓఆర్ఎస్ వంటివి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ప్యాకేజ్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. ఎప్పుడూ ఇంట్లో చేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా పాలకూర, టమాట, బీట్ రూట్ వంటివి ఉండేట్టు చూసుకోవాలి. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. రోగ నిరోధక శక్తిని(Immunity Power)పెంచుతాయి. ఇవి పాటిస్తూనే ప్రతి రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే ఏ మహమ్మారి, ఏ వేరియంట్ మిమ్మల్ని తాకలేదు. 

Also read: Covid Super Strain: ఇండియాలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు, సూపర్ స్ట్రెయిన్‌పై పెరుగుతున్న ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More