Home> హెల్త్
Advertisement

Weight loss Decoction in 15 Days: పొట్ట తగ్గాలా..? ఈ డికాషన్ తాగితే చాలు 15 రోజుల్లో సైజ్ జీరో!

Honey Water For Weight Loss in 15 Days: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి వివిధ ప్రయత్నాలతో పాటు డైట్‌లో తేనె నీటిని తాగుతున్నారు. అయితే ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అందులో చక్కెర పరిమాణాలుంటాయని.. ప్రతి రోజూ తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చుని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Weight loss Decoction in 15 Days: పొట్ట తగ్గాలా..? ఈ డికాషన్ తాగితే చాలు 15 రోజుల్లో సైజ్ జీరో!

Drink Ajwain & Cinnamon Decoction for Weight loss in 15 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకుంటారు. అయితే ఇలా ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటున్నారు. ఇలా తాగడం వల్ల నిజంగా శరీర బరువు తగ్గుతారా..? ఇంతకి ప్రముఖ డైటీషియన్లు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు వారి పేర్కోన్న విషయాలను తెలుసుకుందాం.

ఇటీవల పలు అధ్యయాలు తెలిపిన వివరాల ప్రకారం.. చెంచా తేనెలో కేలరీలు, చక్కెర తప్ప ఏం ఉండవు. ఒక చిన్న చెంచా తేనెలో 6 గ్రాముల చక్కెర, దాదాపు 21 కేలరీలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ తేనెలో 17 గ్రాముల చక్కెర, 64 కేలరీలు లభిస్తుంది. కాబట్టి వేడి నీటిలో తేనెను కలుపుకుని తాగడం వల్ల స్లో పాయిజన్‌గా మారొచ్చు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ఇలా తాగకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహంతో బాధపడుతున్నవారికి తేనె ప్రమాదమా..?:
మధుమేహంతో బాధపడుతున్న రోగులకు తేనె నీరు కూడా చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది వారికి విషం లాంటిది.. వేడి నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా పెరుగుతాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం..అయితే ప్రతి రోజూ వినియోగించే చక్కెరకి బదులుగా తేనె ఆహారాల్లో వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి తేనె వాటర్‌కు బదులుగా దీనిని వినియోగించండి:
బరువు తగ్గడానికి తేనె నీటికి బదులుగా అజ్వైన్-దాల్చిన చెక్కతో తయారు చేసిన డికాషన్‌ తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఒక టీస్పూన్ అజ్వైన్‌, దాల్చినచెక్కలో దాదాపు సున్నా చక్కెర, అతితక్కువ కేలరీలు లభిస్తాయి. కాబట్టి వాటితో తయారు చేసిన నీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అజ్వైన్-దాల్చిన చెక్క డికాషన్‌ ప్రయోజనాలు:
1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. శరీరంలో బాక్టీరియాతో పోరాడుతుంది.
3. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
4. కాలేయాన్ని సంరక్షిస్తుంది.
5. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
6. బ్లడ్‌లో షుగర్‌ను నియంత్రిస్తుంది.
7. జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.
8. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.

Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్

Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More