Home> హెల్త్
Advertisement

Honey Combinations: తేనెను వీటితో కలిపి తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!!

Harmful Honey Combinations: తేనెను వీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తేనెను ఎలాంటి ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది అనేది తెలుసుకుందాం. 
 

Honey Combinations: తేనెను వీటితో కలిపి తింటున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!!

Harmful Honey Combinations: తేనెను మనం ఎక్కువగా స్వీట్‌లకు, కొన్ని పానీయాలకు ఉపయోగిస్తారు. తేనె ఒక ఆరోగ్యకరమైన స్వీటెనర్‌. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్‌ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  

అయితే తేనె ఎంతో ఆరోగ్యకరమైనప్పటికి కొన్ని ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ పదార్థాలతో కలిపి తినడం వల్ల శరీరానికి విషపూరిత అవుతుంది. అయితే ఎలాంటి ఆహారపదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల తేనె మంచిది కాదో మనం తెలుసుకుందాం. 

వేడి నీరు: 

తేనెను వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అందకుండపోతాయి. వేడి వేడి నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా నశిస్తాయని ఆయుర్వేద, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.  

నిమ్మరసం: 

నిమ్మరసంలో తేనెను కలుపుకొని తాగుతుంటారు. దీని డైట్‌లో భాగంగా కూడా  తీసుకోకుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యస్థత దెబ్బతింటుంది. దీని వల్ల గ్యాస్‌, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ రసంతో తేనెను కలిపి తీసుకోవడం మంచిది కాదు. 

పాలు:

మనలో చాలా మంది పాలులో తేనెను కలిపి దేవుడికి అభిషేకం చేసిన పాలను తాగుతారు. కానీ ఇలా తేనె కలిపిన పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. పాలు, తేనెను కలిపినప్పుడు ఇందులోని ప్రోటిన్‌ మారుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

అల్లం: 

తేనెను అల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని మన అందరీకి తెలుసు. దీని వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయని చాలా మంది భావిస్తారు. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు, నొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు . 

వాల్నట్:

ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో చాలా మంది పాలు, తేనె, డ్రై ఫూట్స్‌ను కలిపి తీసుకుంటారు. దీని వల్ల శరీరానికి కొంత శక్తి లభిస్తుందని భావిస్తారు. ముఖ్యంగా వాల్నట్‌ను తేనెతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తినడం వల్ల కేలరీలు పెరుగుతాయి అలాగే ఊబకాయాన్ని కలిగిస్తుంది. కాబట్టి వాల్నట్‌ను తేనెలో కలిపి తినడం వల్ల శరీరానికి మంచిది కాదు. 

Also Read: Fennel Seeds Water: పరగడుపున గోరువెచ్చని నీటిలో ఈ గింజలను కలిపి తాగుతే ఆ సమస్యలకు చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More