Home> హెల్త్
Advertisement

Stomache problems: మీ కిచెన్‌లో ఉండే ఆ పదార్ధంతో కడుపు సంబంధిత సమస్యలకు అద్భుతమైన పరిష్కారం

Stomache problems: నిత్యం ఎదుర్కొనే వివధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం కిచెన్‌లో లభించే వివిధ వస్తువులతోనే ఉంటుంటుంది. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలతై కొన్ని వస్తువులతో మటుమాయమౌతాయి.

Stomache problems: మీ కిచెన్‌లో ఉండే ఆ పదార్ధంతో కడుపు సంబంధిత సమస్యలకు అద్భుతమైన పరిష్కారం

కొన్ని సందర్భాల్లో భోజనం ఎక్కువగా తినడం లేదా ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఫలితంగా కడుపు నొప్పి, మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు ఎదురౌతాయి. కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు మందులు వాడాల్సిన అవసరం లేదు కొన్ని సులభమైన పద్ధతులతో దూరం చేయవచ్చు.

హీంగ్‌తో కడుపు సంబంధిత సమస్యలు దూరం

హింగ్ ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే వస్తువు. వంటలకు రుచి పెంచే ఓ మసాలా పదార్ధమిది. కేవలం కడుపుకే కాదు..గుండె, పళ్లకు సంబంధించిన వివిధ సమస్యలకు ఇది మంచి పరిష్కారం. ఇది కడుపులో వివిధ అంగాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

హీంగ్ మరియు వేడి నీళ్లు

హీంగ్ మిశ్రమం కడుపుకు చాలా మంచిది. హీంగ్‌ను వేడి నీళ్లలో కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాభి చుట్టూ రాసి తేలిగ్గా మస్సాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

హీంగ్ మరియు నెయ్యి

హీంగ్ మరియు నెయ్యి కాంబినేషన్ కడుపుకు చాలా మంచిది. గ్యాస్ , అజీర్ణం సమస్యల్ని తగ్గిస్తుంది. దీనికోసం చిటికెడు హింగ్ తీసుకుని నెయ్యితో కలిపి వేడి చేయాలి. నాభి చుట్టూ రాసి తేలిగ్గా మస్సాజ్ చేయాలి. కొద్దిసేపటిలోనే ఉపశమనం కలుగుతుంది. 

హీంగ్ మరియు ఆవాల నూనె

ఆవనూనె, హీంక్ కలిగి కడుపుకు రాయడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, బ్లోటింగ్ వంటి సమస్యల్నించి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని గుండ్రంగా తిప్పుతూ మస్సాజ్ చేయాలి. పుల్లటి తేన్పులు వస్తుంటే ఛాతీపై రాస్తూ కడుపువైపుకు మస్సాజ్ చేయాలి.

Also read: Women Health Issues: మహిళలు 40 దాటితే ఈ పండ్లు తప్పకుండా తీసుకోవల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More