Home> హెల్త్
Advertisement

Healthy Liver Tips: దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా బతకాలంటే..ఈ 5 పదార్ధాలు మానేయండి

Healthy Liver Tips: దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే మీరు. కొన్ని హానికారకమైన పదార్ధాల్ని ఇవాళే మీ నుంచి దూరం చేయాల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
 

Healthy Liver Tips: దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా బతకాలంటే..ఈ 5 పదార్ధాలు మానేయండి

ప్రపంచంలో ప్రతి వ్యక్తికి దీర్ఘకాలం జీవించాలనుంటుంది. అదే సమయంలో దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలనుంటుంది. కోరిక ఉంటే సరిపోదు..కొన్ని అలవాట్లు క్రమబద్ధీకరించుకోవాలి. ఆరోగ్యంగా జీవించేందుకు కావల్సిన పద్ధతులు పాటించాలి.

ఆరోగ్యంగా దీర్ఘాయుష్షు పొందాలంటే..జీవనశైలిలోనే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా 5 వస్తువుల్నించి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ 5 వస్తువులు మీ ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి. మీరు కూడా ఆరోగ్యంగా జీవించాలనుకుంటే..ముందుగా లివర్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. లివర్ శరీరంలోని కీలకమైన అంగం. మీరు తినే ఆహారం జీర్ణమయ్యేందుకు, విషపదార్ధాలు శరీరం నుంచి బయటకు పంపించేందుకు దోహదపడతాయి. లివర్ అనేది కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఒకవేళ లివర్ విఫలమైతే..ఇక మీ జీవితం ప్రమాదంలో పడినట్టేనని అర్ధం చేసుకోవాలి. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు 5 పదార్ధాల్ని వెంటనే దూరం చేయాలి. లేకపోతే లివర్ ప్రమాదంలో పడుతుంది.

మందులు ఎక్కువగా తీసుకోవడం

వైద్యులు చెప్పిందాని ప్రకారం లివర్ దెబ్బతినడానికి ప్రధాన కారణం తరచూ ఎక్కువ మందులు వాడటం. ముఖ్యంగా బ్రూఫెన్, ఓవెరాన్, కాంబిఫ్లామ్ వంటి పెయిన్ కిల్లర్ మందులు ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. దాంతోపాటు స్టెరాయిడ్, యాంటీ బయోటిక్ మందులు కూడా తగ్గించాలి. ఎందుకంటే ఈ మందులు నెమ్మది నెమ్మదిగా లివర్‌ను బలహీనపరుస్తాయి. లివర్ బలహీనమైతే..పనిచేయడం ఆగిపోతుంది. దాంతో శరీరంలో విషం వ్యాపిస్తుంది. 

జంక్‌ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం

చాలామంది పిజ్జా, బర్గర్ వంటి జంక్‌ఫుడ్స్ తినడం ఇష్టపడుతుంటారు. జంక్‌ఫుడ్స్ అనేవి సాధారణంగా పాడైన మైదా లేదా అనారోగ్యకరమైన పదార్ధాలతో తయారౌతుంటాయి. దాంతో ఫిల్టర్ చేయడంలో లివర్‌కు సమస్య ఎదురౌతుంది. ఫలితంగా లివర్ ఫ్యాటీ అవుతుంటుంది. అందుకే ఇలాంటి పదార్ధాలకు తక్షణం దూరం పాటించాలి.

రెడ్ మీట్‌కు దూరం

ఆహారానికి రుచి కోసం ఉప్పు వేయడం సహజమే. అలాగని సాల్టెడ్ పదార్ధాలు ఎక్కువగా తింటే లివర్‌కు హాని కలుగుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..రెడ్ మీట్ ఎక్కువగా తినకూడదు. లివర్‌కు హాని చేకూర్చే గుణాలు ఇందులో ఉంటాయి.

సప్లిమెంట్స్‌కు దూరం అవసరం

బాడీ ఫిట్‌నెస్ కోసం, శరీర దారుఢ్యం కోసం చాలామంది యువకులు హెల్త్ సప్లిమెంట్స్ తరచూ వాడుతుంటారు. ఈ సప్లిమెంట్స్ బాడీకు సరిపడినా పడకపోయినా..లివర్‌కు మాత్రం డ్యామేజ్ చేస్తాయి. అందుకే వైద్యుని సలహా లేకుండా ఈ విధమైన సప్లిమెంట్స్ వినియోగించకూడదు.

మద్యానికి దూరం

మద్యం అనేది ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, గుండెకు శత్రువు లాంటిది. ఇవి తరచూ సేవిస్తుంటే..శరీరంలో సిరోసిస్ పెరుగుతుంది. ఫలితంగా లివర్ నెమ్మది నెమ్మదిగా పాడవుతుంటుంది. మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే..మద్యానికి ఇవాళే చెక్ చెప్పాలి.

Also read: Diabetes Control: డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఈ 4 పదార్ధాలతో 5 వారాల్లో చెక్ చెప్పేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More