Home> హెల్త్
Advertisement

Heart Health: గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

Heart Health: మనిషి శరీరంలో గుండె అతి ముఖ్యమైన అంగం. గుండె చప్పుడు విన్పించినంత కాలమే మనిషి ప్రాణంగా ఉన్నట్టు అర్ధం. ఒక్కసారి చప్పుడు ఆగిందంటే ప్రాణం లేనట్టే ఇక. గుండె అంత ముఖ్యమైంది. మనిషికి ప్రాణముందో లేదో చెప్పేది ఆ గుండె చప్పుడే.

Heart Health: గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

Heart Health: ఇటీవలి కాలంలో గుండె పోటు సమస్యలు ఎక్కువౌతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులబారిన పడుతున్నారు. గుండె ఆరోగ్యంగా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి. గుండె ఆరోగ్యంగా ఉంటే సడెన్ హార్ట్ ఎటాక్స్ అనేవి ఉండవు. మరి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని విషయాలు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. కొలెస్ట్రాల్ పెరిగినా గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు, తగిన నిద్ర, జీవనశైలి, వ్యాయామం ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రధానంగా చేసే పనుల్లో కీలకమైంది తగినన్ని నీళ్లు తాగడం. చాలామంది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచకుండా వ్యాయామాలు చేస్తుంటారు. దీనివల్ల రక్తం గాఢంగా మారి క్లాట్ సమస్యకు దారితీయవచ్చు. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే నీళ్లు తగినంత తీసుకోవాలి.

గుండె ఏ మేరకు ఆరోగ్యంగా ఉందో తెలుసుకునేందుకు 30 ఏళ్ల వయస్సు దాటాక ఏడాది రెండుసార్లు బాడీ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల ఏదైనా సమస్యలు గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించవచ్చు. అందుకే నిర్ణీత వయస్సు దాటిన తరువాత ఎప్పటికప్పుడు ఫుల్ బాడీ చెకప్ అవసరం. ఇలా చేయడం ద్వారా గుండె వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు.

గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ముందుగా చేయాల్సింది కొవ్వు తగ్గించడం. కొవ్వు పదార్ధాలు తగ్గించకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అందుకే గుండెపోటు సమస్యల్నించి కాపాడుకోవాలంటే ముందు స్థూలకాయం తగ్గించుకోవాలి. బాడీ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటే సగం వ్యాధులు దరిచేరవు. రోజూ 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామంతో హార్ట్ ఎటాక్ సమస్యలతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటిస్, స్థూలకాయం కూడా తగ్గుతాయి. అలాగని ఇంటెన్స్ వర్కవుట్స్ చేయకూడదు. 

జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ఎందుకంటే రక్తంలో కొలెస్ట్రాల్ లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేది వీటివల్లే. ఎప్పుడైతే రక్తంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండి, కొలెస్ట్రాల్ ఉండదో రక్త సరఫరా సక్రమంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం ఏర్పడదు. బాదం, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Also read: Women Health Care Tips: కిడ్నీ సమస్యలు మహిళల్లోనే ఎందుకెక్కువ, కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More