Home> హెల్త్
Advertisement

Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపముందో లేదో ఎలా తెలుసుకోవడం

Iron Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఎక్కడ ఏ లోపమున్నా మొత్తం పనితీరుపై ప్రభావం పడుతుంటుంది. 

Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపముందో లేదో ఎలా తెలుసుకోవడం

Iron Deficiency: మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. శరీరంలో ఏదైనా ఖనిజం లేదా విటమిన్ల లోపం ఏర్పడితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఎప్పటికప్పుడు వీటిని గుర్తించకపోతే సమస్య తీవ్రం కాగలదు. ఇందులో ప్రధానమైంది ఐరన్ లోపం. ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో తరచూ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుున్నారు. కారణం అనారోగ్య ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం. దీనివల్ల శరీరానికి అందాల్సిన విటమిన్లు, పోషకాలు కావల్సినంత పరిమాణంలో అందవు. అందుకే పనితీరుపై ప్రభావం పడి అనారోగ్యం కలుగుతుంటుంది. శరీరానికి అవసరమైన పోషకాల్లో ఐరన్ అతి ముఖ్యమైనది. ఐరన్ లోపం ఏర్పడితే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో ఐరన్ లోపం సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే సకాలంలో ఈ సమస్యను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. లేకుంటే రక్తహీనతకు దారితీస్తుంది. 

శరీరంలో ఐరన్ లోపం ఉంటే హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది. ఏ పనీ చేయలరు. చిన్న చిన్న పనులకే ఒక్కోసారి ఏ పనీ చేయకుండానే అలసట వస్తుంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురౌతాయి. కళ్లు, ముఖం పేలవంగా మారుతుంది. ముఖంపై కాంతి తగ్గుతుంది. కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి తగ్గడంతో త్వరగా సీజనల్ వ్యాధులు సోకుతుంటాయి. తరచూ అనారోగ్యం బారిన పడుతుంటారు. 

ఈ సమస్యకు పరిష్కారం ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ పాలు, ఐరన్ ఉత్పత్తులు ఉండేట్టు చూసుకోవాలి. 

Also read: AP Volunteers: వాలంటీర్లకు సంక్రాంతి కానుక, 15 నుంచి 25 వేలు ఇచ్చేందుకు నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More