Home> హెల్త్
Advertisement

Heart Attacks: చిన్నారుల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులు, కారణమేంటి, ఎలా తగ్గించవచ్చు

Heart Attacks: జీవన శైలి మారేకొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వెంటాడుతోంది. చిన్న చిన్న పిల్లలు సైతం గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

Heart Attacks: చిన్నారుల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులు, కారణమేంటి, ఎలా తగ్గించవచ్చు

Heart Attacks: ఆదునిక బిజీ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జీవన విధానమే మారిపోయింది. వేళాపాళా లేని తిండి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య తీవ్రమౌతోంది. 

ఈ మధ్య కాలంలో గుండెపోటు చిన్నారుల్ని సైతం వీడటం లేదు. సాధారణంగా గుండెపోటు అంటే 55 ఏళ్లు దాటిన తరువాత సంభవించేది. ఆ తరువాత 40 దాటాక ఎప్పుడైనా వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే చిన్నారులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. గుజరాత్‌లో ఈ మధ్యనే 15 ఏళ్ల బాలిక పరీక్ష హాలులో గుండెపోటుతో కుప్పకూలి మరణించింది. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందనేది ఆరా తీయగా జీవనశైలిలో మార్పులు, సరైన పోషకాహారం లేకపోవడం కారణాలుగా తెలిసింది. మరోవైపు విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కూడా కారణాలుగా ఉన్నాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.

గుండెజబ్బులకు ప్రధాన కారణాల్లో ఆందోళన, ఒత్తిడి ముఖ్యమైనవి. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండటంతో పాటు గుండె జబ్బులు, కార్డియాక్ రిస్క్ కారకాలతో ఆందోళనకు సంబంధముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడే హఠాత్తుగా గుండెపోటు సమస్య వస్తుంటుంది. ఎందుకంటే శరీరంలో ఒత్తిడి, ఆందోళన కలిగినప్పుడు శరీరంలోని వివిధ భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ అవసరమౌతుంది. అందుకే హార్ట్ బీట్ పెరుగుతుంది. అంటే కార్టిసోల్ లెవెల్స్ పెరగడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది. దాంతో శారీరకంగా మానసికంగా సమస్య రావచ్చు. 

ఆందోళన, ఒత్తిడిని రాత్రికి రాత్రి తగ్గించలేం. దీనికోసం బ్రీతింగ్ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ధ్యానం, యోగా, దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం వంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా కొద్దికాలానికి తగ్గించవచ్చు. తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కండరాల ఒత్తిడి తగ్గుతుంది. అధిక రక్తపోటు, మైగ్రెయిన్, నిద్ర లేమి సమస్యలకు తేలికపాటి వ్యాయామం సరైన పరిష్కారం కాగలదు. ఇక రోజూ తగినంత ప్రశాంతమైన నిద్ర కూడా అవసరం. రోజుకు రాత్రి వేళ 7-8 గంటల నిద్ర కచ్చితంగా ఉంటేనే శరీరంలో అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా చిన్నారుల్లో గుండెపోటు ఘటనల్ని నివారించవచ్చు. 

Also read: Anti Ageing Tips: ఈ ఐదు అలవాట్లు పాటిస్తే చాలు, వయస్సు మీరినా వృద్ధాప్యం దరిచేరదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More