Home> హెల్త్
Advertisement

Ginger Effects: అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

Ginger Effects: ఆయుర్వేదం ప్రకారం అల్లం అత్యుత్తమ ఔషధం. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అల్లం సరైన పరిష్కారం. అయితే అదే అల్లం అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్యం ఎదురౌతుంది. అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తెలుసుకుందాం..

Ginger Effects: అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

Ginger Effects: ప్రతి భారతీయుని కిచెన్‌లో తప్పకుండాలభించే పదార్ధం అల్లం. అల్లంను వంటల్లో వినియోగిస్తుంటారు. అయితే ఆరోగ్యపరంగా కూడా అల్లం చాలా మంచిది. సాధారణంగా ఎక్కువమంది అల్లం టీ తాగుతుంటారు. ఉత్తరాదిన అయితే అల్లం లేని టీ ఉండనే ఉండదు. అయితే వేసవిలో అల్లం మంచిదా కాదా అనే సందేహాలున్నాయి.

అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే..పరిమితి దాటితే అనర్ధాలకు దారి తీస్తుంది. పలు అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ఎందుకంటే అల్లం స్వభావం వేడి చేసేదిగా ఉంటుంది. అందుకే చలికాలంలో అల్లంను చాలామంది ఏదో రూపంలో డైట్‌లో భాగంగా చేసుకుంటారు. కానీ వేసవిలో అంత మంచిది కాదు.  రుచికి, ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది. కానీ అల్లం అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేకూరుతుంది. అల్లం కొన్ని వ్యాధుల్ని ఎలా దూరం చేస్తుందో అదే విధంగా కొన్ని వ్యాధులకు కారణమౌతుంది. అల్లం తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ పరిమితంగా ఉండాలి. రోజుకు కేవలం 5 గ్రాముల వరకే అల్లం తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అల్లం తీసుకోవడడం వల్ల చాలా సమస్యలు ఎదురౌతాయి. అల్లం అతిగా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు, వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 

అల్లంలో రక్తాన్ని పలుచన చేసే గుణముంటుంది. ఎక్కువగా అల్లం తీసుకోవడం వల్ల లేదా అల్లం టీ తాగడం వల్ల లో బీపీ ముప్పు వెంటాడుతుంది. ఇందులో ఉండే ఎలిసిన్ బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. 

గర్భిణీలకు మంచిది కాదా

గర్భిణీ మహిళల ఆరోగ్యం కోసం అల్లం ఎక్కువగా తీసుకోవడం నష్టదాయకం కాగలదు. అల్లం అతిగా తీసుకుంటే కడుపు నొప్పి సమస్య ఉత్పన్నమౌతుంది. అంతేకాకుండా గర్భిణీ మహిళల గర్భంపై కూడా ప్రభావం పడవచ్చు.

మధుమేహం నియంత్రణ

అల్లం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. హైపో గ్లైసీమియాకు కారణం కావచ్చు. ఒకవేళ మీకు లో షుగర్ ఉంటే అల్లం అతిగా తీసుకోవద్దు.

పీరియడ్స్‌లో హాని

అల్లం అతిగా తీసుకోవడం వల్ల పీరియడ్స్‌లో హాని కల్గిస్తుంది. రక్తాన్ని పల్చగా చేసి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా పీరియడ్స్ ఉన్నప్పుడు అల్లం ఎక్కువగా తింటే..ఎక్కువ రక్తం బయటకు పోతుంది.

ఎసిడిటీ కారణం

అల్లంతో ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. అల్లం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఫలితంగా ఎసిడిటీ వస్తుంది. దాంతో ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది. అల్లం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లేదా ప్రేవుల సమస్యకు కారణం కావచ్చు.

Also read: Cholesterol Tips: ఈ పదార్ధాలు క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు..కొలెస్ట్రాల్ మటుమాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More