Home> హెల్త్
Advertisement

Vitamin 'D' Rich Foods: విటమిన్ 'D' లోపంతో బాధపడుతున్నారా..? మరేం పర్లేదు ఇవి తింటే సరిపోతుంది!

Vitamin 'D' Rich Foods: వేసవి మండిపోతోంది. ఎండల తీవ్రత నుంచి తప్పించుకునేందుకు బయటకు రావడమే కష్టమైపోయింది. అదే సమయంలో శరీరానికి విటమిన్ డి కూడా అవసరం. విటమిన్ డి లోపాన్ని సరి చేసేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

Vitamin 'D' Rich Foods: విటమిన్ 'D' లోపంతో బాధపడుతున్నారా..? మరేం పర్లేదు ఇవి తింటే సరిపోతుంది!

Vitamin 'D' Rich Foods: వేసవి వేడిమి నుంచి తప్పించుకోకపోతే చాలా సమస్యలు ఎదురౌతాయి. అందుకే వేసవి కాలంలో ఇంటి నుంచి బయటకు రావడం మానేస్తుంటారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడవచ్చు. అందుకే వేసవిలో కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలు సేవించడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం..

మనిషి శరీర నిర్మాణంలో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి కారణంగానే శరీరంలో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అంతేకాకుండా అలసట రాకుండా నివారిస్తుంది. విటమిన్ డి లోపముంటే చిన్న చిన్న పనులకే అలసట, నీరసం ఆవహిస్తుంది. ఎముకలు సైతం బలహీనమౌతుంటాయి. విటమిన్ డి లోపమున్నప్పుడు ముఖ్యంగా డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని పూర్తి చేసేది సూర్య రశ్మి మాత్రమే. అయితే ఇది సాధ్యం కానప్పుడు కొన్ని ప్రత్యేక పదార్ధాలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని సరిచేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

పాలలో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ డి కూడా కావల్సినంతగా లభిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల కాల్షియంతో పాటు శరీరానికి కావల్సినంతగా విటమిన్ డి దొరుకుతుంది. అందుకే విటమిన్ డి లోపాన్ని సరిచేసేందుకు పాల ఉత్పత్తులు తప్పకుండా అవసరమౌతాయి. 

Also Read: Low Blood Pressure: ఈ ప్రాణాయామంతో కేవలం 10 రోజుల్లో లో బీపీ మాయం..

విటమిన్ డి లభించే మరో ప్రధానమైన ఆహారం మష్రూం. శాకాహారులు విటమిన్ డి లోపాన్ని సరిచేసుకోవాలంటే మష్రూంకు మించింది లేదు. మష్రూం అనేది కాల్షియం, విటమిన్ డికు ప్రధాన ఆధారం. వారంలో కనీసం 2-3 సార్లు మష్రూం తినడం వల్ల విటమిన్ డి లోపం తలెత్తదు. 

గుడ్లు

విటమిన్ డి లోపాన్ని సరిచేసేందుకు బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి వేసవిలో గుడ్లు తక్కువగా తీనాల్సి వస్తుంది. కానీ ఆరోగ్యంగా ఉండేందుకు, విటమిన్ డి లోపం దూరం చేసేందుకు రోజూకు ఒక బాయిల్డ్ ఎగ్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల కాల్షియం, ఐరన్, విటమిన్ డి మూడూ లభ్యమౌతాయి.

Also Read: Weight Loss Tips: శరీర బరువును తగ్గించే షేక్స్‌ ఇవే, ఆరోగ్యంగా తగ్గాలనుకునేవారికి అద్భుత అవకాశం..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More