Home> హెల్త్
Advertisement

Kidney Problems: ఫిట్‌గా కన్పిస్తున్నా కిడ్నీ సమస్యలు వెంటాడుతున్నాయా. కారణాలివే

Kidney Problems: ఆధునిక జీవన విధానంలో ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అన్నింటికీ కారణం ఒకటే చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి. పోటీ ప్రపంచం కావడంతో సాధారణంగా వీటిపై ధ్యాస ఉండదు. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటుంది.

Kidney Problems: ఫిట్‌గా కన్పిస్తున్నా కిడ్నీ సమస్యలు వెంటాడుతున్నాయా. కారణాలివే

Kidney Problems: చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులతో పాటు కిడ్నీ సమస్యలు ప్రధానం ఎదుర్కోవల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్యలు అధికమౌతున్నాయి. ఆశ్చర్యమేంటంటే బయటికి ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉన్నా అంతర్గతంగా కిడ్నీ సమస్యలు బాధిస్తున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. 

ఇదంతా ఫిట్‌గా కన్పించే అంశానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఫిట్‌గా కన్పించడం కంటే ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ హెల్తీ ఫుడ్ తినకపోతే మాత్రం బయటకు ఎంత ఫిట్‌గా ఉన్నా లోపల మాత్రం కిడ్నీ సమస్యలు వెంటాడే అవకాశాలుంటాయి. అయితే ఫిట్నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తుల్లో వ్యాధుల్నించి బయటపడటం సులభమౌతుంది. ఫిట్‌గా కన్పించే వ్యక్తుల్లో కిడ్నీ సమస్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

మీ శారీరక సామర్ధ్యానికి మించి వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా మీ కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కిడ్నీల పనితీరు మందగిస్తుంది. జిమ్‌కు రోజూ వెళ్లే వ్యక్తులు ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. అయితే ఈ సప్లిమెంట్స్‌కు తగ్గట్టుగా నీళ్లు తాగకపోతే మాత్రం కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది.

చాలామందికి తక్కువ సమయంలోనే శరీరాన్ని ఫిట్ అండ్ స్లిమ్‌గా మార్చుకోవాలని ఉంటుంది. దీనికోసం టెస్టోస్టిరోన్ ఇంజక్షన్లు కూడా తీసుకుంటుంటారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. దీని ప్రభావం కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. మెరుగైన ఆరోగ్యం పొందాలంటే నిర్ణీత మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి. కానీ ప్రోటీన్లు సేవించేందుకు కొన్ని నియమాలున్నాయి. ఇందులో మొదటిది నిర్ణీత మోతాదులో తగినన్ని నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాయామం చేసిన తరువాత తగినంత నీళ్లు తాగకపోతే తీసుకున్న ప్రోటీన్లు కిడ్నీలపై అధిక ఒత్తిడికి కారణమౌతాయి.

సాధారణంగా ఒక వ్యక్తి ప్రతి రోజూ ప్రతి కిలోకు ఒక గ్రాము చొప్పిన ప్రోటీన్లు తీసుకోవాలి. అదే జీమ్‌కు వెళ్లే వ్యక్తి అయితే రోజుకు 2 గ్రాముల చొప్పున ప్రోటీన్లు సేవించాల్సి ఉంటుంది. ప్రోటీన్లు తీసుకున్న ప్రతిసారీ తగినంత నీళ్లు తాగకపోతే కిడ్నీల పనితీరుపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. పిట్నెస్ అంటే కేవలం బయటుకు ఫిట్‌గా కన్పించడం కాదు. ఆహార పదార్ధాలు, జీవనశైలి కూడా బాగుండాలి. ఏ విధమైన లక్షణాల్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. 

Also read: Health Tips: ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కు లంగ్స్‌తో సంబంధమేంటి, మంచిదా కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More