Home> హెల్త్
Advertisement

Iron Requirement: రోజూకు ఎంత మోతాదులో ఐరన్ అవసరం, ఐరన్ లోపంతో కన్పించే లక్షణాలేంటి

Iron Requirement: మనిషి ఆరోగ్యం అనేది వివిధ రకాల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉంటే ఫిట్ అండ్ హెల్తీగా ఉండగలరు. ఈ పోషకాల్లో అతి ముఖ్యమైంది ఐరన్. వయస్సుని బట్టి ఐరన్ ఎంత అవసరం అనేది ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Iron Requirement: రోజూకు ఎంత మోతాదులో ఐరన్ అవసరం, ఐరన్ లోపంతో కన్పించే లక్షణాలేంటి

Iron Requirement: శరీర నిర్మాణం, ఎదుగుదలకు విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. ఈ పోషకాలన్నీ మనం తినే ఆహర పదార్ధాల నుంచే లభ్యమౌతుంటాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు దూరమై వివిద రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ పోషకాల్లో అతి ముఖ్యమైంది ఐరన్. ఐరన్ సరైన మోతాదులో ఉంటేనే శరీరం ఫంక్షనింగ్ బాగుంటుంది. బ్లడ్ సెల్స్ నిర్మాణంలో కూడా ఐరన్ కీలకపాత్ర వహిస్తుంది. ఐరన్ లోపముంటే ఎనీమియా లోపం తలెత్తవచ్చు. శరీరంలో ఐరన్ లోపిస్తే తీవ్రమైన అలసట ఉంటుంది. తరచూ గొంతెండిపోతుంటుంది. దాహం ఎక్కువగా వేస్తుంది. నీరసం ఆవహిస్తుంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. గొంతులో గరగర ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు.

అయితే శరీరంలో ఐరన్ ఎంత మోతాదులో ఉండాలనేది ప్రధాన అంశం. ఇది పురుషులు, మహిళల్లో వయస్సుని బట్టి మారిపోతుంటుంది. పిల్లలతో పోలిస్తే యువకుల్లో ఐరన్ ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో పీరియడ్స్ కారణంగా పురుషులతో పోలిస్తే ఎక్కువ కావల్సి ఉంటుంది. 

4-8 ఏళ్ల పిల్లలకు రోజుకు 10 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమౌతుంది. ఇక 9-13 ఏళ్లవారికి రోజుకు 8 మిల్లిగ్రాములు అవసరమౌతుంది. 19-50 ఏళ్ల మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాముల ఐరన్ కావాలి. అదే 19-50 ఏళ్ల పురుషులకైతే రోజుకు 8 మిల్లీగ్రాముల ఐరన్ సరిపోతుంది. 

ఒక్కమాటలో చెప్పాలంటే మెరుగైన ఆరోగ్యం ఉండాలంటే ఐరన్ తగిన మోతాదులో ఉండాల్సిందే. దీనికోసం ఐరన్ పుష్కలంగా లభించే బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, తులసి, బెల్లం, ములక్కాయ, నువ్వులు, బీట్‌రూట్, ఉసిరి, నేరేడు, నిమ్మ, పిస్తా, దానిమ్మ, ఆపిల్, పాలకూర, డ్రై కిస్మిస్, అంజీర్, జామ, అరటి డైట్‌లో ఉండేట్టు చూసుకుంటే చాలు. 
రోజుకో రకం డైట్‌లో ఉండేట్టు చూసుకుంటే ఐరన్ లోపం తీరడమే కాకుండా ఇతర పోషకాలు కూడా అందుతాయి.

Also read: Cholesterol Lowering Tips: రోజూ బ్రేక్‌‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు కొలెస్ట్రాల్ సమస్యకు చిటికెలో పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More