Home> హెల్త్
Advertisement

Intermittent Fasting: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిదా కాదా

Intermittent Fasting: డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. ఒకసారి మధుమేహం సోకితే ఇక జీవితాంతం మందులు వాడటం, డైట్ పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోతుంటుంది. అయితే కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చు. 

Intermittent Fasting: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిదా కాదా

Intermittent Fasting: మధుమేహానికి ఇప్పటి వరకూ కచ్చితమైన, పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేదు. మందులు వాడుతూ డైట్ పాటిస్తూ అదుపులో మాత్రమే ఉంచుకోగలరు. ఈ మధ్య కాలంలో ప్రచారంలో వచ్చిన ఇంటర్ మిట్టెంట్ ఫాస్టింగ్ మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్‌తో కలిగే ప్రయోజనాలు

మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ద్వారా చాలా ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ ఉపయోగితను శరీరం సమర్ధవంతంగా తీసుకుంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు లాభదాయకం. ఎందుకంటే వీరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. 

ఫాస్టింగ్ పీరియడ్స్ ద్వారా పోస్ట్ మీల్ గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంటే ఓవరాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మెడిసిన్ వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. మధుమేహం వ్యాధిగ్రస్థులకు సైతం లాభదాయకం. ఎందుకంటే హెల్తీ వెయిట్ అనేది కచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు దోహదపడుతుంది. 

ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అభివృద్ధి చెందుతాయి. అంటే మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఉండే నొప్పులు దూరమౌతాయి. ఇన్సులిన్ నిరోధకత కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.

ఫాస్టింగ్ కారణంగా డ్యామేజ్ సెల్స్ తొలగించి మెటబోలిజం మెరుగుపర్చే సెల్యులర్ ప్రక్రియ ఆటోఫేగీను వేగవంతం చేస్తుంది. ఫలితంగా మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఉపయోగం కలుగుతుంది. 

ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ కారణంగా లిపిడ్ ప్రొపైల్స్‌లో మెరుగుదల కన్పిస్తుంది. ట్రై గ్లిసరైడ్స్ తగ్గడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ సక్రమంగా ఉండటం వంటివి చూడవచ్చు. ఫలితంగా కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. 

ఫాస్టింగ్ వల్ల మెటబోలిజం, ఆకలి ప్రక్రియలో కీలక భూమిక వహించే ఇన్సులిన్, ఘ్రేలిన్, అడిఫోనెక్టిన్ వంటి హార్మోన్లపై మెరుగైన ప్రభావం పడుతుంది. ఈ హార్మోన్లలో సమతుల్యత ద్వారా మధుమేహం నియంత్రణలో మంచి ఫలితాలు చూడవచ్చు.

ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ అనేది ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలుగుతుంది. మదుమేహం వ్యాధిగ్రస్థుల జీవనశైలిని సులభతరం చేస్తుంది. 

ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్‌తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా సరే..ఇది పాటించేముందు వైద్యుని సలహా తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వ్యక్తి పరిస్థితిని బట్టి ప్రభావం మారవచ్చు. కొందరికి పడవచ్చు లేదా కొందరికి ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అదే సమయంలో క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.

Also read: Diabetes Control Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేసే ఆరు అద్భుతమైన పద్ధతులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More