Home> హెల్త్
Advertisement

Gut Health: కడుపులో వ్యర్ధాలు తొలగించే అద్భుతమైన మూడు మూలికలు, మరో వంద రోగాలకు చెక్

Gut Health: మనిషి ఆరోగ్యం అనేది అతని జీవనశైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. దినచర్య బాగుంటే అన్నీ బాగుంటాయి. రోజువారీ దినచర్యలో ఏ సమస్య తలెత్తినా అసౌకర్యంగా ఉంటుంది. మనిషి అనారోగ్యానికి వివిధ రకాల కారణాలుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Gut Health: కడుపులో వ్యర్ధాలు తొలగించే అద్భుతమైన మూడు మూలికలు, మరో వంద రోగాలకు చెక్

Gut Health: మనిషి ఆరోగ్యం అనేది ప్రదానంగా జీర్ణక్రియతో ముడిపడి ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే కడుపు శుభ్రం కాదు. ఇది తీవ్ర అసౌకర్యానికి కారణమవడమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు దారి తీస్తుంది. 

రోజూ ఉదయం కడుపు శుభ్రం కాకపోతే ఆ ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుంది. చర్మంపై, జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కడుపు, ప్రేవుల్ని పూర్తిగా శుభ్రం చేసేందుకు ఆయుర్వేదంలో చాలా రకాల మూలికల చికిత్స అందుబాటులో ఉంది. వాస్తవానికి కడుపు సంబంధిత సమస్యలు చాలామందిలో ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది మల బద్దకం. మలబద్ధకం సమస్య చాలా తీవ్రమైందిగా పరిగణించాల్సి ఉంటుంది. ఆ ప్రభావం నేరుగా ఆరోగ్యంపైనే కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. కడుపు శుభ్రం కాకపోతే రోజంతా నీరసం, అలసట ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాల వ్యాదులకు కారణమౌతుంది.

కడుపు రోజూ శుభ్రం కాకపోతే ఆ ప్రభావం నేరుగా చర్మంపై, జీర్ణక్రియపై పడుతుంది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయుర్వేదంలో చాలా మూలికలున్నాయి. ముఖ్యంగా మూడు రకాల ముూలికలతో సహజసిద్దంగా కడుపులో వ్యర్ధాల్ని బయటకు తొలగించవచ్చు.

కడుపులో వ్యర్ధాల్ని తొలగించేందుకు పుదీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. 

త్రిఫలం అనేది సహజసిద్ధమైన ఆయుర్వేద ఔషధం. కడుపు సంబంధిత సమస్యలకు దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. కడుపుని శుభ్రం చేసేందుకు దోహదం చేస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో త్రిఫలం విరివిగా ఉపయోగిస్తారు. 

ఇక అందరికీ సుపరిచితమైన అల్లోవెరా సైతం మలబద్ధకం సమస్యను నిర్మూలిస్తుంది. కడుపు శుభ్రం చేసేందుకు అల్లోవెరా చాలా లాభదాయకంగా ఉంటుంది. కడుపు మంట, ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.

Also read: Heart Attack vs Panic Attack: హార్ట్ ఎటాక్ , పానిక్ ఎటాక్ మధ్య తేడా ఏంటి, ఎలా గుర్తించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More