Home> హెల్త్
Advertisement

Diabetic Foods: మధుమేహంతో బాధపడుతున్నారా, రోజూ ఈ 4 పండ్లు తింటే చాలు

Diabetic Foods: ఆధునిక జీవన విధానంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. లైఫ్‌స్టైల్ వ్యాధిగా పిలిచే మధుమేహాన్ని అలక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. 

Diabetic Foods: మధుమేహంతో బాధపడుతున్నారా, రోజూ ఈ 4 పండ్లు తింటే చాలు

Diabetic Foods: మధుమేహం ఎంతటి ప్రాణాంతకమే అప్రమత్తంగా ఉంటే అంతే సులభంగా నియంత్రించగలిగే వ్యాధి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం, జీవనశైలి మార్చుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పలు అధ్యయనాల ప్రకారం డయాబెటిస్ ప్రతి పదిమందిలో ఐదుగురికి కచ్చితంగా ఉంటోంది. పోటీ ప్రపంచంలో ఫాస్ట్ ఫుడ్స్, చెడు ఆహారపు అలవాట్లు, పని వేళలు, నిద్ర లేమి, పని ఒత్తిడి వంటి కారణాలు మధుమేహానికి కారణమౌతున్నాయి. ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న డయాబెటిస్ వ్యాధి నిర్మూలనకు డైట్ మార్పు కీలకం కానుంది. అందుకే డైట్‌లో కొన్ని ఆహార పదార్ధాలు చేరిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. దీనికోసం కొన్ని పండ్లు తప్పకుండా తీసుకోవాలి. డయాబెటిస్ రోగులు అన్ని రకాల పండ్లను తినకూడని కారణంగా, ఏది తినవచ్చు, ఏది తినకూడదనే వివరాలు తెలుసుకోవాలి. 

1. కివీ ఫ్రూట్స్ 

కివీ ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటుగా ఇందులో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం వంటి న్యూట్రియంట్లు కూడా అధికమే. డయాబెటిస్ రోగులకు కివీ పండ్లు చాలా మంచివి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

2. జామ

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు జామ అత్యుత్తమమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ గుణాలు అత్యధికంగా ఉంటాయి. ఇవి కాకుండా ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటంతో జీర్ణక్రియ సులభమై..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. జామ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ.

3. నేరేడు పండ్లు

నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఓ ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో చాలా ప్రయోజనకరం. నేరేడు పండ్లు రుచిపరంగా కూడా బాగుంటాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. నేరేడు విత్తనాల పౌడర్ రోజూ పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహం దాదాపుగా నిర్మూలన అవుతుంది.

4. ఆరెంజ్

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు మరో అద్భుతమైన ఔషధం లాంటిది ఆరెంజ్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.

Also read: Healthy Heart: గుండె ఆరోగ్యానికి ఏ పదార్ధాలు తినాలి, ఏవి తినకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More