Home> హెల్త్
Advertisement

Diabetes Tips: డైట్‌లో ఈ జ్యూస్‌లు ఉంటే..5 వారాల్లోనే డయాబెటిస్‌కు చెక్, పరీక్షించి చూసుకోండి

Diabetes Tips: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రమాదకరమైంది మధుమేహం. ప్రస్తుతం ప్రపంచమంతా చాపకిందనీరులా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జీవనశైలిని మార్చుకోలేకపోవడమే వ్యాధి వ్యాపించడానికి కారణమౌతోంది.

Diabetes Tips: డైట్‌లో ఈ జ్యూస్‌లు ఉంటే..5 వారాల్లోనే డయాబెటిస్‌కు చెక్, పరీక్షించి చూసుకోండి

Diabetes Tips: ప్రపంచంలోనే కాకుండా ఇండియాలో సైతం డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటుందని తెలుస్తోంది. స్లో పాయిజన్‌లా విస్తరిస్తున్న మధుమేహాన్ని సులభమైన పద్ధతులతో చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం

ఆధునిక జీవనశైలి తీసుకొచ్చిన ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి మధుమేహం. ఎంత ప్రమాదకరమో..ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడం ద్వారా అంత సులభంగా నియంత్రించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రవ పదార్ధాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.

మధుమేహం అనేది స్లో పాయిజన్ లాంటిది. మనిషిని నిలువునా దహించేస్తుంది. ఎంత ప్రమాదకర వ్యాధో..అప్రమత్తంగా ఉంటే అంత సులభంగా నియంత్రించవచ్చు. పూర్తిగా నయం చేయలేం కానీ అదుపులో ఉంచుకోవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే..డయాబెటిస్ ఉన్నవాళ్లకు..గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువే. అంతేకాదు..మధుమేహం కారణంగా మూత్రపిండాల సమస్య ఎదురవుతుంది. అందుకే ఆహారపు అలవాట్లలో మార్పులు, కొన్ని రకాల ద్రవ పదార్ధాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

గ్రీన్ టీ ప్రయోజనకరం

డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ ఓ దివ్యౌషధం. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉండటంతో శరీరానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వారికి చాలా మంచిది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 

కాకరకాయ, బీట్‌రూట్ జ్యూస్

మధుమేహం నియంత్రణలో దోహదపడే మరో జ్యూస్ కాకరకాయ జ్యూస్. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే..డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమౌతాయి. ఇక మరొకటి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే బీట్‌రూట్ జ్యూస్. శరీరంలో రక్త హీనతను కూడా దూరం చేస్తుంది. చలికాలంలో తీసుకోవడం వల్ల వెచ్చగా ఉంటుంది. 

కొబ్బరి నీళ్లు

మధుమేహం నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడే మరో ప్రకృతి సిద్ధమైన ఔషదం కొబ్బరి నీళ్లు. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, ఎమైనో యాసిడ్స్ కారణంగా అలసట ఉండదు. కొబ్బరి నీరు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 

కీరా జ్యూస్

వేసవిలో అద్భుతంగా పనిచేసే కీరా జ్యూస్‌తో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో లభించే కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, బీ1, ఎమైనో యాసిడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్స్ విడుదల బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఈ పదార్ధాల్ని క్రమం తప్పకుండా వారానికి కనీసం 3-4 సార్లు వినియోగిస్తుండాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. 

Also read: Heart Attack Reasons: ఆందోళన కల్గిస్తున్న ఆకస్మిక గుండెపోట్లు, ఎలాంటి జాగ్రత్తలు అవసరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More