Home> హెల్త్
Advertisement

Cholesterol Control Tip: శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకంత ప్రమాదకరం, సులభంగా తగ్గించుకునే మార్గాలు

Cholesterol Control Tip: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ముఖ్యమైంది కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ ఉంటే వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

Cholesterol Control Tip: శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకంత ప్రమాదకరం, సులభంగా తగ్గించుకునే మార్గాలు

Cholesterol Control Tip: మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్ డీఎల్ దీనినే చెడు కొలెస్ట్రాల్ అంటారు. రెండవది గుడ్ కొలెస్ట్రాల్, హెచ్ డీఎల్. కొన్ని రకాల ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా కొలెస్ట్రాల్ సమస్యను నియంత్రించవచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఇంకా ఇతర సమస్యలు చాలా వెంటాడుతాయి.

శరీర నిర్మాణం, ఆరోగ్యం కోసం గుడ్ కొలెస్ట్రాల్ ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరం. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ తరుణంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు కొన్ని రకాల ఆహార పదార్ధాల జాబితా విడుదల చేశారు. ఈ ఆహార పదార్ధాలు కొవ్వును కరిగించడమే కాకుండా మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చంటున్నారు. 

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్ధాలు

ఆకుపచ్చని కూరగాయలు అధికంగా తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇక నట్స్, తృణ ధాన్యాలు రోజూ తీసుకుంటే..ఎల్‌డీఎల్‌ నియత్రించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. 

బరువు నియంత్రణ

కొలెస్ట్రాల్ అరికట్టాలంటే ముందు అధిక బరువుకు చెక్ పెట్టాలి. బీన్స్ ఇందుకు మంచి ఆహారం. ఇందులో ఉండే హై ప్రోటీన్స్ కారణంగా త్వరగా ఆకలి వేయదు. బీన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఇక వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెజిటబుల్ ఆయిల్స్‌లో అంతగా కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే విటమిన్ ఇ, కేలు చెడు కొవ్వును నియంత్రిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్న చేపల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించుకోవచ్చు. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సోయా బీన్స్ మంచి ఫుడ్. ప్రతి రోజూ సోయా ఉత్పత్తుల్ని తీసుకోవడం వల్ల బాడీలో ఎల్‌డీఎల్ తగ్గుతుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్ధాలతో పాటు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటే మన శరీరంలో సాల్యుబుల్ ఫైబర్ పెరుగుతుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి అధిక బరువు సమస్య పోతుంది.

Also read: Health Tips: ఛాతీలో మంటను నిర్లక్ష్యం చేయవద్దు, ప్రమాదకరవ్యాధికి సంకేతం కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More