Home> హెల్త్
Advertisement

Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్య అంటే ఏమిటి, ఎలా తగ్గించుకోవచ్చు

Uric Acid Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటోంది. అన్నింటికీ మూల కారణం చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్య అంటే ఏమిటి, ఎలా తగ్గించుకోవచ్చు

Uric Acid Problem: ఇటీవలి కాలంలో ఎదురౌతున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి యూరిక్ యాసిడ్ సమస్య. ఆధునిక బిజీ పోటీ యుగంలో లైఫ్‌స్టైల్ చెడిపోవడంతో ఈ సమస్య సాధారణమైపోయింది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ సమస్య అనేది సాధారణంగా అధిక బరువు, చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, కొన్నిరకాల మందుల వాడకం వల్ల వస్తుంటుంది. అంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది. యూరిక్ యాసిడ్ అనేది సాధారణంగా శరీరంలో కణాల విచ్ఛిన్నం సమయంలో ఏర్పడే ఓ వ్యర్ధ పదార్ధం. కిడ్నీల ద్వారా బయటకు వచ్చేస్తుంది. కానీ యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే కిడ్నీల ద్వారా బయటకు విసర్జితం కాదు. ఫలితంగా కీళ్ల నొప్పులు, అరికాలి మంట, వేళ్ల జాయింట్లలో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. 

యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు అద్భుతమైన చిట్కాలు చాలానే ఉన్నాయి. మెంతులు, కొత్తిమీర నీటితో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీళ్లలో మెంతులు కొత్తిమీర నానబెట్టి ఉదయం పరగడుపు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజులు చేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య తలెత్తదు.  ఈ నీళ్లలో ఉండే వివిధ రకాల పోషకాలు ఇందుకు దోహదపడతాయి. ముఖ్యంగా మెంతి గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కొత్తిమీరలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పిని తగ్గిస్తాయి. అయితే కొన్ని వారాలు క్రమం తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది. 

మెంతులు, కొత్తిమీర నానబెట్టిన నీళ్లను రోజూ పరగడుపున తాగడం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఇందుకు ఉపయోగపడుతుంది. అధిక బరువు సమస్య కూడా తొలగిపోతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

Also read: Winter Food For Diabetes: శీతాకాలంలో తప్పకుండా మధుమేహం ఉన్నవారు 4 ఆహారాలు తీసుకోవాలి..ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More