Home> హెల్త్
Advertisement

Piles Causes: జీర్ణక్రియకు అత్యంత ప్రమాదకరం, పైల్స్ సమస్యను పెంచే పదార్ధాలివే

Piles Causes: జీర్ణక్రియలో సమస్య అనేది పైల్స్ ప్రధాన లక్షణం. పైల్స్ నుంచి రక్షించుకోవాలంటే..కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Piles Causes: జీర్ణక్రియకు అత్యంత ప్రమాదకరం, పైల్స్ సమస్యను పెంచే పదార్ధాలివే

పైల్స్ అనేది ఓ ప్రమాదకరమైన వ్యాధి. దీనివల్ల తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం. జీర్ణక్రియలో సమస్య ఉంటే ఆది కాస్తా పైల్స్‌కు దారి తీస్తుంది. అందుకే ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. 

పైల్స్ వంటి ప్రమాదకర వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. కొన్ని రకాల పదార్ధాల తినడం వల్ల పైల్స్ సమస్య ఉత్పన్నమౌతుంది. ముఖ్యంగా ఫైబర్ తక్కువగా ఉండే పదార్ధాలు మలబద్ధకానికి కారణమౌతాయి. మలబద్ధకమనేది పైల్స్‌కు దారి తీస్తుంది. పైల్స్ సమస్య నుంచి రక్షించుకునేందుకు ఏ విధమైన ఆహార పదార్ధాలు తీసుకోవాలో చూద్దాం.

ఫాస్ట్‌ఫుడ్స్, ఫ్రోజెన్ ఫుడ్స్‌కు దూరం

ఫాస్ట్‌ఫుడ్స్ , ఫ్రోజెన్ ఫుడ్స్ తినడం వల్ల పైల్స్ సమస్య పెరిగిపోతుంది. ఈ పదార్ధాలు జీర్ణక్రియకు హాని చేకూరుస్తాయి. ఇక ఫాస్ట్‌ఫుడ్స్‌లో మైదా ఉండటం వల్ల ఫైబర్ లోపం తలెత్తి..జీర్ణక్రియలో ఇబ్బంది కలుగుతుంది. 

అధిక ఆయిల్, మసాలా పదార్ధాలు

ఎక్కువ ఆయిల్, మసాలా పదార్ధాలు జీర్ణక్రియకు నష్టం కల్గిస్తాయి. పైల్స్ సమస్యను మరింతగా పెంచుతాయి. ఆయిల్, మసాలా పదార్ధాలు జీర్ణం కావడం ఆలస్యమౌతుంది. అందుకే పైల్స్ సమస్య పోవాలంటే ఇలాంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.

చీజ్ ఫుడ్స్

ఇటీవలి కాలంలో చీజ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. చీజ్ అనేది మలబద్ధకానికి ప్రధాన కారణంగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో చీజ్ తినడం వల్ల మలబద్ధకం ముప్పు ఏర్పడుతుంది. అందుకే పిజ్జా, శాండ్విచ్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. 

ప్యాకెట్ ఫుడ్స్

చిప్స్, కుర్కురే వంటి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికారకం. ఇందులో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. చిప్స్ వంటి పదార్ధాలు తినడం వల్ల పైల్స్ సమస్య పెరిగిపోతుంది. ముఖ్యంగా మలబద్ధకం తీవ్ర సమస్యగా మారుతుంది. 

పైల్స్ సమస్య నుంచి రక్షించుకునేందుకు ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆలుబుకరా, జాంకాయ, యాపిల్ వంటి పండ్లు తీసుకుంటే పైల్స్ ముప్పు తగ్గుతుంది. తృణధాన్యాలు, బీన్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

Also read: Green Tea Benefits: పరగడుపున గ్రీన్ టీ తాగితే..ఆశ్చర్యపోయే లాభాలు, వ్యాధులు దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More