Home> హెల్త్
Advertisement

Pista Benefits: పిస్తా, పాలు కలిపి తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Pista Benefits: మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ప్రయోజనకరం. డ్రై ఫ్రూట్స్‌లో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పిస్తా గురించి. పిస్తాలో పోషక విలువలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
 

Pista Benefits: పిస్తా, పాలు కలిపి తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పిస్తాలో భారీగా పోషక పదార్ధాలుంటాయి. ఇందులో ఉండే విటమిన్ బి6, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా..పలు వ్యాధుల్నించి విముక్తి పొందవచ్చు.

శరీరంలో ప్రోటీన్లు, విటమిన్లు, న్యూట్రియంట్ల లోపంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే రోజూ పిస్తా తినే అలవాటుంటే ఏ విధమైన వ్యాధి దరిచేరదు. పిస్తాను పాలలో ఉడికించి తాగడం అలవాటు చేసుకుంటే..ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆ లాభాలేంటో పరిశీలిద్దాం..

కండరాలకు బలం

పిస్తా, పాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కండరాలు పటిష్టంగా ఉంటాయి. పాలు, పిస్తాలో పెద్దమొత్తంలో ప్రోటీన్లు ఉండటం వల్ల కండరాలకు బలం చేకూరుస్తుంది. అందుకే రోజుకు కనీసం 6-7 పిస్తాలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఎముకలకు బలం

పాలలో పిస్తాను ఉడికించి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పాలు, పిస్తాలో కాల్షియం పెద్దమొత్తంలో ఉండటం వల్ల ఎముకలకు అదనపు బలం చేకూరుతుంది. కీళ్లు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు కూడా దూరమౌతాయి. 

కంటికి ప్రయోజనకరం

పిస్తా, పాలు కలిపి తీసుకోవడం వల్ల కంటికి చాలా మంచిది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇటీవలి కాలంలో మొబైల్, ల్యాప్ టాప్ వినియోగం అధికమై..కంటి చూపు మందగించే సమస్యలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో పిస్తా ఈ సమస్యకు మంచి పరిష్కారంగా ఉంటుంది. పిస్తా, పాలు కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు ప్రయోజనకరం. పాలలో పిస్తాను ఉడికించి తింటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

Also read: Kidney Health: కిడ్నీ సమస్యలకు ఈ పదార్ధాలు ప్రమాదకరం, వెంటనే దూరం పెట్టండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More