Home> హెల్త్
Advertisement

Lungs Health: ఆ విటమిన్ లోపిస్తే ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయి తస్మాత్ జాగ్రత్త

Lungs Health: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఊపిరితిత్తులు కీలకమైనవి. ఊపిరి ఉన్నంతవరకే ప్రాణం నిలుస్తుంది. అందుకే లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. లంగ్స్ ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
 

Lungs Health: ఆ విటమిన్ లోపిస్తే ఊపిరితిత్తులు ప్రమాదంలో పడతాయి తస్మాత్ జాగ్రత్త

Lungs Health: మన చుట్టూ ఉండే వాతావరణం, చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం అనేవి ఊపిరితిత్తుల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతోంది అందుకే. 

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఇప్పుడు గాలి మరోసారి కలుషితమైంది. ఎక్కడెక్కడైతే కాలుష్యం ఉంటుందే అక్కడ ఇదే పరిస్థితి. గాలి నాణ్యత పడిపోవడం వల్ల ఆ ప్రభావం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై పడుతుంటుంది. అందుకే లంగ్స్ ఆరోగ్యం అనేది పాడవకుండా చూసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావల్సింది విటమిన్ కే. విటమిన్ కే అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది లంగ్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ కే లోపం వల్ల ఊపిరితిత్తుల్లో స్వెల్లింగ్ సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా లంగ్స్ సామర్ధ్యం తగ్గిపోతుంది. దాంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. 

విటమిన్ కే లోపం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్ ముప్పు పెరుగుతుందని వివిధ రకాల అధ్యయనాల్లో తేలింది. విటమిన్ కే లోపిస్తే ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తవచ్చు. మరోవైపు కే విటమిన్ లోపం వల్ల క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ సమస్య తలెత్తుతుంది. లంగ్స్ సామర్యం, పనితీరుపై ప్రభావం పడుతుంది.

అయితే విటమిన్ కే లోపం లేకుండా చూసుకోవడం పెద్ద కష్టమేం కాదు. సరైన ఆహార పదార్ధాల ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు. ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుకూరలు విటమిన్ కేకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. పాలకూర, అరటి, బ్రోకలి డైట్‌లో భాగం చేసుకుంటే విటమిన్ కే లోపం సమస్య రాదు. గుడ్లు కూడా మరో మంచి పరిష్కారం. గుడ్డు పసుపు భాగంలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. 

మార్కెట్‌లో లభించే వివిధ రకాల బీన్స్ అంటే మటర్, బీన్స్, సోయా బీన్స్, చిక్కుడు, గోరుచిక్కుడు కాయల్లో కావల్సినంత విటమిన్ కే లభిస్తుంది. ఇక వనస్పతి ఆయిల్‌లో కూడా విటమిన్ కే చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. జైతూన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆనపకాయ గింజల్లో విటమిన్ కే లభిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నట్స్ , విత్తనాల్లో విటమిన్ కే పెద్దఎత్తున లభిస్తుంది. బాదం, వాల్‌నట్స్, ఆనపకాయ విత్తనాలు మంచి ప్రత్యామ్నాయాలు. 

Also read: Diabetic Care Tips: ఈ ఆకులతో ఎంతటి మధుమేహమైన దిగి రావడం ఖాయం..నమ్మట్లేదా ట్రై చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More