Home> హెల్త్
Advertisement

Vitamin B12 Foods: విటమిన్ బి12 నాన్‌వెజ్‌లోనే కాదు..వెజ్‌లో కూడా లభిస్తుంది, ఆ పదార్ధాలివే

Vitamin B12 Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ బి12. ఆరోగ్యం విషయంలో విటమిన్ బి12 అద్భుతమైన పోషక పదార్ధం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 

Vitamin B12 Foods: విటమిన్ బి12 నాన్‌వెజ్‌లోనే కాదు..వెజ్‌లో కూడా లభిస్తుంది, ఆ పదార్ధాలివే

Vitamin B12 Foods: మరి విటమిన్ బి12 కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్న వచ్చినప్పుడు సహజంగానే నాన్‌వెజ్ ఫుడ్స్ విన్పిస్తాయి. కారణం విటమిన్ బి12 ఇందులో సమృద్ధిగా ఉంటుంది. మరి శాకాహారుల పరిస్థితి ఏంటనే ప్రశ్న వచ్చినప్పుడు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెజ్ ఆహారంలో కూడా విటమిన్ బి12 లభిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

శరీర నిర్మాణం, ఆరోగ్యం, ఎదుగుదలలో కీలకంగా ఉపయోగపడే విటమిన్ బి12 కోసం ఇప్పుడు కేవలం నాన్‌వెజ్ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. చేపలు, గుడ్లు, మాంసం లేకుండానే విటమిన్ బి12 పొందవచ్చు. కొన్ని శాకాహార పదార్దాల్లో సైతం విటమిన్ బి12 పుష్కలంగానే లభిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ బి12 లభించే పదార్ధాలు తగిన మోతాదులో తీసుకోకపోతే పలు సమస్యలు చుట్టుముడతాయి. చాలామందిలో ఉదయం లేవగానే మార్నింగ్ సిక్నెస్ అంటే బాగా అలసినట్టు ఉండటం, ఆఫీసులో బద్దకంగా ఉండటం, కునుకు తీయడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. విటమిన్ బి12 లోపం వల్లనే ఈ లక్షణాలు కన్పిస్తాయి.

అందుకే విటమిన్ బి12 లోపం అనేది గంభీరమైన సమస్యగానే పరిగణించాలి. విటమిన్ బి12 లోపముంటే కాళ్లు లేదా చేతులు తిమ్మిరెక్కడం కూడా జరుగుతుంటుంది. వాస్తవానికి విటమిన్ బి12 అనేది రెడ్ మీట్, చికెన్, చేపలు, గుడ్లలో పుష్కలంగా లభిస్తుంది. అయితే శాకాహారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల వెజ్ ఫుడ్స్‌లో కూడా విటమిన్ బి12 లభిస్తుంది. ఏయే వెజ్ ఫుడ్స్‌లో విటమిన్ బి12 లభిస్తుందో తెలుసుకుందాం..

ఓట్ మీల్స్..ఇదొక అద్భుతమైన హెల్తీ ఫుడ్. ఎక్కువగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఉదయం అల్పాహారంగా ఓట్ మీల్స్ తీసుకుంటే రోజంతా కావల్సిన శక్తి లభిస్తుంది. అలసట, బలహీనత ఉండవు. 

పాల ఉత్పత్తుల్లో కూడా  విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సూపర్ ఫుడ్‌గా పిల్చుకునే పాలలో ఎక్కువగా ఉంటుంది. పాలలో విటమిన్ బి12తో పాటు చాలా రకాల న్యూట్రియంట్లు ఉంటాయి. విటమిన్ బి12 కూడా లభిస్తుంది. రోజూ ఉదయం లేవగానే పాలు తాగితే మంచి ఫలితాలుంటాయి.

విటమిన్ బి12 పుష్కలంగా లభించే మరో పదార్ధం పెరుగు. ఇండియాలో పెరుగులేనిదే ఆహారం పరిపూర్ణం కాదు. ఇందులో మిటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి12తో పాటు సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ లభిస్తాయి. పెరుగు తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు పూర్తిగా లభిస్తాయి. అయితే ఫ్యాట్ లేని పెరుగు తినడం మంచిది. లేకపోతే కొవ్వు పేరుకుపోయి కొలెస్ట్రాల్ సమస్యకు దారి తీయవచ్చు. కొలెస్ట్రాల్ అనేది క్రమంగా అధిక రక్తపోటు, గుండెపోటు వ్యాధులకు కారణమౌతుంది. 

Also read: Wrinkle Problem: ముఖంపై ముడతలు బాధిస్తుంటే..ఈ స్వీట్‌తో నిత్య యౌవనం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More