Home> హెల్త్
Advertisement

Health Drink: రోజూ ఉదయం ఈ టీ తాగితే చాలు చర్మానికి నిగారింపు, అధిక బరువుకు చెక్

Health Drink: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఆరోగ్యం పాడవుతుంటుంది. అధిక బరువు సమస్యగా మారుతుంటుంది. అయితే ఈ సమస్యను చాలా సులభంగానే పరిష్కరించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Health Drink: రోజూ ఉదయం ఈ టీ తాగితే చాలు చర్మానికి నిగారింపు, అధిక బరువుకు చెక్

Health Drink: సాధారణంగా టీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. రోజూ తీ తాగకుండా ఉండలేరు. అయితే పాల టీ కాకుండా హెర్బల్ టీ తాగితే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా చర్మానికి నిగారింపు వస్తుంది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఎన్నో పోషకాలు దాగుంటాయి. అందులో కీలకమైంది నిమ్మకాయ. నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనిషి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. ప్రతిరోజూ పరగడుపున లెమన్ ట్రీ తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. చిగుళ్లలో స్వెల్లింగ్ లేదా నొప్పి సమస్య ఉంటే ఒక కప్ లెమన్ టీతో తగ్గించుకోవచ్చు. నిమ్మలో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. కిడ్నీలో రాళ్ల సమస్య, చర్మానికి నిగారింపు, శరీరాన్ని హైడ్రేట్ చేయడం వంటివాటికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే రోజూ పరగడుపున లెమన్ టీ తాగితే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. 

చిగుళ్లలో నొప్పిని తగ్గించడంలో నిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి, సైట్రిక్ యాసిడ్ చిగుళ్ల నొప్పిని చాలా బాగా తగ్గిస్తుంది. చిగుళ్లు నొప్పిగా ఉన్నప్పుడు వెంటనే ఒక కప్పు లెమన్ టీ తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. నొప్పి నుంచైతే తక్షణం ఉపశమనం పొందవచ్చు.

లెమన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మంపై ఏర్పడే పింపుల్స్, యాక్నే, ఎగ్జిమాలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లెమన్ టీ అనేది చర్మంలోని మృత కణాల్ని తొలగించడంలో ఉపయోగపడుతుంది. 

లెమన్ టీతో ఎముకల పటిష్టత, జీర్ణక్రియ మెరుగుపర్చడం సాధ్యమౌతుంది. నిమ్మలో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల్ని పటిష్టం చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒక కప్పు లెమన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. అటు నిమ్మలో కార్బోహైడ్రేట్లు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు నిమ్మలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు లెమన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత వ్యాధులు దూరమౌతాయి.

Also read: Pre Diabetes: ప్రీ డయాబెటిస్..డయాబెటిస్ కంటే ప్రమాదకరమా, ఎలా కాపాడుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More