Home> హెల్త్
Advertisement

Honey Purity Test: తేనె అసలైందో కాదో ఎలా తెలుసుకోవడం, టాప్ 4 చిట్కాలు

Honey Purity Test: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అద్బుతమైన ఔషధ గుణాలు కలిగిన తేనెతో వివిధ రకాల రోగాలు నయం చేయవచ్చు. ఆయుర్వేదం ప్రకారమైతే తేనె ఓ ఔషధంలా పనిచేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Honey Purity Test: తేనె అసలైందో కాదో ఎలా తెలుసుకోవడం, టాప్ 4 చిట్కాలు

Honey Purity Test: ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే తేనెతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కల్పించే ఇమ్యూనిటీని అందిస్తుంది. అయితే తేనె ఒరిజినల్ అయితేనే ఫలితాలు బాగుంటాయి. మార్కెట్‌లో లభించే తేనెలో ఏది అసలైంది, ఏది నకిలీనో తేల్చలేక మోసపోయే పరిస్థితి ఉంటుంది. 

తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అత్యధికం కాబట్టే తేనెకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కూడా ఉంటోంది. ఈ క్రమంలో ఒరిజినల్ తేనె లభించడం కష్టమౌతోంది. చాలా సందర్భాల్లో ప్యూరిటీ టెస్ట్ కూడా దాటేస్తుంటుంది తేనె. ఒకేరకం చెట్టు జాతి నుంచి లభించే తేనె చాలా ఒరిజినల్‌గా చెప్పవచ్చు. తేనె అసలైంది అయితేనే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ నకిలీ అయితే ఆరోగ్యానికి హాని కలగవచ్చు. అందుకే మార్కెట్‌లో లభించే తేనె అసలైందో కాదో తెలుసుకోవల్సిన అవసరం చాలా ఉంది. 

దురదృష్టవశాత్తూ తేనెకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్ వల్ల ఒరిజినల్ లభించడం కష్టమౌతోంది. నకిలీ తేనె కూడా ఎలా ఉంటుదంటే చాలావరకూ ప్యూరిటీ పరీక్షల్ని దాటి మార్కెట్‌లో వచ్చేస్తోంది. అందుకే తేనెలో ఏది అసలు, ఏది నకలు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. తేనె అసలైందా కాదా అనే చిట్కాలు తెలుసుకోవాలి. ఆ చిట్కాల ఆధారంగా తేనె ఒరిజినాలిటీ చెక్ చేయవచ్చు. ఆ చిట్కాలు, పరీక్షలు గురించి తెలుసుకుందాం.

కాగితంపై ఒక డ్రాప్ తేనె వేయాలి. తేనె అసలైంది అయితే..విశిష్టమైన లక్షణం కన్పిస్తుంది. తేనె ఒరిజినల్ అయితే ఆ కాగితం తేనెను అంత వేగంగా గ్రహించుకోదు. అదే సమయంలో మచ్చ ఏదీ మిగలదు. అదే డూప్లికేట్ అయితే ఆ కాగితం చాలా వేగంగా ఆ తేనెను గ్రహించుకుంటుంది. కాగితంపై మచ్చ కూడా పడుతుంది. అంటే ఈ తేనెలో ఇతర రసాయనాలు కలవవచ్చు.

ఓ గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ తేనె కలపాలి. ఒకవేళ తేనె నీళ్లలో కరిగిపోతే అది డూప్లికేట్ అని అర్ధం. ఒకవేళ నీళ్లలో సరిగ్గా కరగకపోతే అది ఒరిజినల్ అని అర్ధం. అంటే నీళ్లలో పూర్తిగా కరగక అడుగున ఉండిపోతుంది. 

ఓ కర్ర చివర కొద్దిగా తేనె ముట్టించాలి. ఇప్పుడా కొసను మంటల్లో ఉంచాలి. తేనె సులభంగా మండితే అది ఒరిజినల్ అని అర్ధం. లేక నెమ్మది నెమ్మదగా కరిగితే నకిలీ అని అర్ధం.

కొద్దిగా తేనె వేళ్లపై తీసుకుని బాగా రుద్దాలి. ఒకవేళ తేనె జిగురుగా ఉండి ఫ్లో కాకపోతే అది ఒరిజినల్ అని అర్ధం. ఒకవేళ జిగురుగా లేక ఫ్లో అయితే డూప్లికేట్ అని అర్ధం.

Also read: High BP: హై బీపీ ఉందా..? ఈ పద్ధతులు పాటించండి.. బీపీకి దూరంగా ఉండండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More