Home> హెల్త్
Advertisement

Green Peas Benefits: రోజూ గ్రీన్ పీస్ బఠానీ తింటే చాలు..ఎలాంటి వ్యాధి దరిచేరదు

Green Peas Benefits: మనిషి ఆరోగ్యం అనేది మనం తినే ఆహార పదార్ధాల్లోనే ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలన్నీ ప్రకృతిలోనే లభ్యమౌతుంటాయి. ఎందులో ఎలాంటి పోషకాలున్నాయనేది తెలుసుకోగలిగితే చాలు. శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Green Peas Benefits: రోజూ గ్రీన్ పీస్ బఠానీ తింటే చాలు..ఎలాంటి వ్యాధి దరిచేరదు

Green Peas Benefits: ప్రకృతిలో లభించే గ్రీన్ పీస్ లేదా మటర్ అలాంటిదే. ఇదొక అద్బుతమైన సూపర్‌ఫుడ్ అని చెప్పవచ్చు. చలికాలంలో ఎక్కువగా వచ్చే మటర్ రుచిపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనకరమైంది. మటర్‌లో దాదాపు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అందుకే మటర్‌ను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తుంటారు. 

గ్రీన్ పీస్ లేదా మటర్ ప్రతి యేటా శీతాకాలంలో విరివిగా లభిస్తుంది. మటర్‌ను చాలా రకాలుగా తీసుకోవచ్చు. కూర రూపంలో, సలాడ్ రూపంలో ఎలాగైనా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చిగానే తినడం ఇష్టపడుతుంటారు. మటర్ లేదా గ్రీన్ పీస్‌లో పోషకాలకు లోటుండదు. మటర్ నేరుగా తింటే ఇంకా లాభదాయకమంటారు. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్ కావల్సినంత లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.

శీతాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. ఫలితంగా వివిధ రకాల సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు వంటి పీడిస్తుంటాయి. రోజూ పచ్చి బఠానీలు తినడం అలవాటు చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ విధమైన సీజనల్ వ్యాధులు దరిచేరవు. 

గ్రీన్ పీస్ లేదా మటర్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే శరీరం బరువు తగ్గించుకునే ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మటర్ తినడం వల్ల ఎనర్జీ కూడా దీర్ఘకాలం ఉంటుంది. దాంతో చాలాసేపటి వరకూ ఆకలి వేయదు. వ్యాయామం ఇతర శారీరక ప్రక్రియలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

గ్రీన్ పీస్ బఠానీలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుకోవచ్చు. ఫలితంగా ఆరోగ్య సంబంధమైన చాలా సమస్యలు దూరమౌతాయి. కేన్సర్ ముప్పు కూడా దూరం కావచ్చు. గ్రీన్ పీస్‌లో పొటాషియం కావల్సినంతగా ఉంటుంది. దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అధిక రక్తపోటును సైతం నియంత్రణలో ఉంచేందుకు గ్రీన్ పీస్ ఉపయోగపడుతుంది. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ముప్పు తగ్గుతుంది. అయితే గ్రీన్ పీస్ క్రమం తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. 

Also read: Pistachio Benefits: పిస్తా పలుకులతో డయాబెటిస్‌, అధిక బరువు, జుట్టు రాలడం సమస్యలకు శాశ్వతంగా చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More