Home> హెల్త్
Advertisement

Fiber Benefits: శరీరానికి ఫైబర్ ఎందుకు అవసరం, ఫైబర్‌తో కలిగే ప్రయోజనాలేంటి

Fiber Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషక పదార్ధాలు అవసరమౌతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఎప్పుడూ ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. శరీరంలో పోషకాల లోపంతోనే వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాలు మీ కోసం..
 

Fiber Benefits: శరీరానికి ఫైబర్ ఎందుకు అవసరం, ఫైబర్‌తో కలిగే ప్రయోజనాలేంటి

Fiber Benefits: మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాల్లో విటమిన్లు, మినరల్స్‌తో పాటు అతి ముఖ్యమైంది ఫైబర్. తీసుకునే ఆహారంలో ఫైబర్ సమృద్దిగా ఉంటే ఏ విధమైన అనారోగ్యం దరిచేరదు. అంటే సంపూర్ణ ఆరోగ్యానికి ఫైబర్ తప్పనిసరి. అందుకే సాధ్యమైనంతవరకూ ఫైబర్ ఉండే పదార్ధాలనే తీసుకోవాలంటారు వైద్యులు.

మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లు, మినరల్స్ ఎలా అవసరమో ఫైబర్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుడూ శరీరపు మెటబోలిజంపై ఆధారపడి ఉంటుంది. మెటబోలిజం బాగున్నంతవరకూ ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఉత్పన్నం కాదు. మెటబోలిజం వృద్ధి చెందాలంటే ఫైబర్ చాలా కీలకమని గుర్తుంచుకోవాలి. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి. రోజూ మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపిస్తే జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండదు. ఫలితంగా అనారోగ్యం కలుగుతుంది.

మనిషి అనారోగ్యానికి కారణమయ్యే పలు కారకాల్లో కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఒక్కటే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇక మరొకటి డయాబెటిస్. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధి ఇది. ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడంతో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మధుమేహం నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లో, మన ఆహారపు అలవాట్లపైనే ఉంటుంది. తీసుకునే ఆహారంతో ఫైబర్ ఎక్కువగా ఉంటే మధుమేహం చాలావరకూ తగ్గుతుంది. దీనికోసం ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్తాయి తగ్గుతుంది.

ఆహారంలో ఫైబర్ తగిన మోతాదులో ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తవు. దీనికోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు దోహదపడతాయి.ఫైబర్ ఎక్కువగా ఉంటే మలబద్ధకం సమస్య కూడా పోతుంది. ఇక గుండె సంబంధిత వ్యాధులు తగ్గించేందుకు కూడా ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది.

ఇక అన్నింటికంటే ముఖ్యమైంది బరువు నియంత్రణ. రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ తగిన మోతాదులో ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో తిన్న ఆహారం ఎప్పటికప్పుడు జీర్ణమై కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బరువు తగ్గుతుంది. 

అందుకే తినే ఆహారంలో ఫైబర్ ఆవశ్యకత చాలా ఉంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలు, పండ్లు రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండవచ్చు. అన్ని రకాల కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కీరా ఫైబర్‌కు మంచి ప్రత్యామ్నాయం. ఇక పండ్లతో జామలో పైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. జామతో పాటు ఆపిల్, బొప్పాయి, బత్తాయిల్లో ఫైబర్ కావల్సినంత లభిస్తుంది.

Also read: Weight Loss Tips: రోజూ ఈ డ్రింక్ తాగితే 3 వారాల్లో అధిక బరువుకు చెక్, ఇంకా ఇతర ప్రయోజనాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More