Home> హెల్త్
Advertisement

Kidney Care Tips: మీ కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది ఈ అలవాట్లే

Kidney Care Tips: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది కిడ్నీ. కిడ్నీ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. రక్తాన్ని ఫిల్టర్ చేయడం కిడ్నీ ప్రధాన విధి. తద్వారా విష పదార్ధాల్ని బయటకు పంపించేస్తుంది. 

Kidney Care Tips: మీ కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది ఈ అలవాట్లే

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో ఒకటి కిడ్నీ ఆరోగ్యం. ఎందుకంటే కిడ్నీ నిర్వర్తించే పని అలాంటిది. శరీరంలోని విష పదార్ధాల్ని బయటకు పంపించే పని కిడ్నీలదే. అందుకే కిడ్నీ ఆరోగ్యం సదా చూసుకోవాలి. 

శరీరంలోని విష పదార్ధాల్ని తొలగించి బ్లేడర్‌కు పంపిస్తుంది కిడ్నీ. అక్కడి నుంచి మూత్రం ద్వారా ఆ విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని అలవాట్లు కారణంగా కిడ్నీలో సమస్యలు ఏర్పడుతుంటాయి. ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం..

ఆహారపు అలవాట్లు

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మీ ఆహారపు అలవాట్లు బాగుండాలి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్, స్వీట్స్ దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్‌లో సోడియం అంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీపై ప్రభావం చూపిస్తుంది. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం సమస్య తలెత్తుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ సమస్య దీర్ఘకాలం ఉంటే..కిడ్నీపై ప్రభావం పడుతుంది. 

నీళ్లు తక్కువగా తాగే అలవాటు

కిడ్నీ ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ నీళ్లు పుష్కలంగా తాగాలి. అధిక మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీరపు వ్యర్ధ పదార్ధాలు సులభంగా బయటకు వచ్చేస్తాయి. తక్కువ నీళ్లు తాగడం వల్ల కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది. అంటే కిడ్నీల సామర్ధ్యం తగ్గుతుంది. 

తక్కువ నిద్ర

ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 8 గంటలు మంచి సుఖమైన నిద్ర ఉండాలి. రోజూ తగిన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నిద్ర సంబంధం నేరుగా కిడ్నీతో ఉంటుంది. నిద్ర తక్కువైతే..కిడ్నీ ఎక్కువ సేపు పనిచేయాల్సి ఉంటుంది. దాంతో కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ సరిపడినంత నిద్ర అవసరం. 

Also read: Health Tips: ఈ ఆరు పదార్ధాలు తీసుకుంటే..రక్తంలో వ్యర్ధాలు తొలగి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More