Home> హెల్త్
Advertisement

Cold and Flu Difference: సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలెలా ఉంటాయి, రెండింటికీ అంతరం ఎలా గుర్తించాలి

Cold and Flu Difference: సీజన్ మారినప్పుడు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. జ్వరం, జలుబు వంటి సమస్యల్నించి ఎలా సంరక్షించుకోవాలి, ఫ్లూ లక్షణాల్ని ఎలా గుర్తించాలనేది చాలా అవసరం. ఆ వివరాలు మీ కోసం..

Cold and Flu Difference: సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలెలా ఉంటాయి, రెండింటికీ అంతరం ఎలా గుర్తించాలి

వర్షాకాలం, చలికాలంలో జ్వరం, జలుబు ముప్పు ఎక్కువౌతుంది. అదే సమయంలో ఫ్లూ కూడా వెంటాడుతుంది. రెండింటి లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు రెండింటికీ తేడాను ఎలా గుర్తించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది పరిశీలిద్దాం..

మరి కొద్దిరోజుల్లో వర్షాకాలం దాటి చలికాలం ప్రవేశించనుది. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఉదయం వేళ చలిగాలులు వీస్తున్నాయి. సీజన్ మారుతున్న ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల సంరక్షణ చాలా అవసరం. ఈ సమయంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడతాయి. గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో సాధారణ జ్వరమా లేదా ఫ్లూ అనేది గుర్తు పట్టడం కష్టం. మరి ఈ రెండింటినీ ఎలా గుర్తించాలో చూద్దాం..

ఫ్లూ, జలుబులో తేడా ఇదే

ఫ్లూ-జలుపు మధ్య చాలా తేడా ఉంది. ఫ్లూ వచ్చినప్పుడు సహజంగా తీవ్రమైన లక్షణాలుంటాయి. వాటి దుష్పరిణామాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఫ్లూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి తీవ్రంగా బలహీనమౌతాడు. జ్వరం-జలుబు ఉన్నప్పుడు ఎవరికి ఏ వ్యాధి సోకిందనేది గుర్తించడం కష్టమౌతుంది. ఎందుకంటే సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఫ్లూ వచ్చినప్పుడు లక్షణాలు తీవ్రంగా ఉంటే..సాధారణ జలుబులో క్రమంగా మెరుగవుతుంది. ఫ్లూ అనేది హఠాత్తుగా ప్రారంభమౌతుంది. 

3-4 రోజుల వరకూ 100 డిగ్రీల కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఉంటే అప్రమత్తం కావాలి. జ్వరం ఉన్నప్పుడు మజిల్స్‌లో నొప్పి, వీపు వెనుక భాగంలో చలి వేయడం, బలహీనత, అలసట, మైగ్రెయిన్ వంటి లక్షణాలు కన్పిస్తే ఫ్లూగా గుర్తించవచ్చు. అజీర్ణం, వాంతులు కూడా ఉంటాయి. ఇవి సాధారణ జలుబులో ఉండవు. సాధారణ జలుబుతో పోలిస్తే ఫ్లూ లక్షణాలు కాస్త తీవ్రంగా ఉంటాయి. 

జలుబు-దగ్గు, జ్వరం, గొంతులో నొప్పి, గొంతులో ఇబ్బంది వంటి లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ రెండింట్లోనూ కన్పిస్తాయి. అందుకే ఈ రెండింటి మధ్య తేడా గుర్తించడం కష్టమౌతుంటుంది. 

కేవలం తుమ్ములు లేదా దగ్గు మాత్రమే ఉండి జ్వరం ఉండదు ఒక్కోసారి. కానీ జ్వరం కూడా ఉంటే కచ్చితంగా అలర్ట్ కావాలి. ముక్కు కారినంతమాత్రాన జ్వరం లక్షణం కాదు. వాతావరణ మార్పు వల్ల కూడా ఇలా జరుగుతుంది. 4-6 రోజుల్లో మీ గొంతు సమస్య మెరుగవకపోతే వైద్యుడిని సంప్రదించాల్సిందే.

Also read: Diabetes Tips: ఈ సూపర్ ఫుడ్స్ ఉంటే చాలు, నెలరోజుల్లో డయాబెటిస్‌కు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More