Home> హెల్త్
Advertisement

Diabetes Medicine: పసుపుతో ఆ రెండు పదార్ధాల కాంబినేషన్, డయాబెటిస్ చిటికెలో మాయం

Diabetes Medicine: ఆయుర్వేదంలో పసుపుకున్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. పుసుపు సకల రోగ నివారిణి. చర్మ సంరక్షణ, డయాబెటిస్ సమస్యకు పసుపు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు..
 

Diabetes Medicine: పసుపుతో ఆ రెండు పదార్ధాల కాంబినేషన్, డయాబెటిస్ చిటికెలో మాయం

Diabetes Medicine: ఆయుర్వేదంలో పసుపుకున్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. పుసుపు సకల రోగ నివారిణి. చర్మ సంరక్షణ, డయాబెటిస్ సమస్యకు పసుపు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు..

పసుపు ప్రతి భారతీయ వంటింట్లో లభించే పదార్ధం. ఆయుర్వేదశాస్త్రంలో పుసుపు ప్రాముఖత ఎనలేనిది. పసుపు ప్రయోజనాల గురించి ఆయుర్వేదంలో విస్తృతంగా వివరించి ఉంది. మెరుగైన ఆరోగ్యం, చర్మ సంరక్షణకు పసుపు చాలా లాభదాయకం. ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపుదలలో పసుపు కీలకంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పసుపు మధుమేహ వ్యాధిగ్రస్థులకు కూడా చాలా మంచిది. పసుపు క్రమం తప్పకుండా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అయితే డయాబెటిస్ రోగులు పసుపు ఏ రూపంలో ఎంత తీసుకోవాలో తెలుసుకుందాం..

డయాబెటిస్ రోగులకు పసుపు చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. పసుపులో పుష్కలంగా లభించే కర్‌క్యూమిన్ కారణంగా డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కర్‌క్యూమిన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. పసుపు, దాల్చినచెక్క కలిపి తీసుకుంటే..డయాబెటిస్ సులభంగా తగ్గిపోతుంది. ఓ గ్లాసు పాలలో పసుపు, దాల్చినచెక్క పౌడర్ కలిపి వేడి చేయాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ప్రతిరోజూ తాగితే చాలా మంచిది. 

ఇక మరో కాంబినేషన్ పసుపు నల్ల మిరియాలు. ఈ రెంటి మిశ్రమం కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. పాలలో పసుపు, నల్ల మిరియాల పౌడర్ కలుపుకుని రోజూ రాత్రి పూట తాగితే చాలా మంచిది. పసుపు, నల్ల మిరియాల పౌడర్ వేసి పాలను వేడి చేసి తాగాలి. మరో కాంబినేషన్ పసుపుతో ఉసిరికాయలు. పసుపుతో ఉసిరికాయ పౌడర్ కాంబినేషన్ అనేది డయాబెటిస్ నిర్మూలనకు చాలా మంచిది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఉసిరికాయ పౌడర్ పసుపు మిక్స్ చేసి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఇది డయాబెటిస్ రోగులకు మంచిది. 

Also read: Vomiting Problems: తరచుగా జర్నీలో వాంతులతో అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More