Home> హెల్త్
Advertisement

Weight Loss Tips: ఈ డైట్ తీసుకుంటే చాలు, 2 నెలల్లో స్థూలకాయం మాయం

Weight Loss Tips: ఉరుకులు పరుగుల బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. స్థూలకాయం అనేది ఆరోగ్యపరంగా కూడా ఏమాత్రం మంచిది కాదు. కేవలం వ్యాయామంతోనే కాదు..డైట్ కూడా స్థూలకాయం నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. 
 

Weight Loss Tips: ఈ డైట్ తీసుకుంటే చాలు, 2 నెలల్లో స్థూలకాయం మాయం

Weight Loss Tips: స్థూలకాయం లేదా అధిక బరువు అతి పెద్ద సమస్య. స్థూలకాయం కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఒక్కోసారి ఈ సమస్యలు ప్రాణాంతకం కావచ్చు. బరువు వేగంగా తగ్గించుకోవాలంటే రోజువారీ డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది.

ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. నలుగురిలో ఇబ్బందిగా కన్పించడమే కాకుండా చాలా రకాల వ్యాధులు ఎదురౌతుంటాయి. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం ఒక్కటే సరిపోదంటున్నారు ఆరోగ్య నిపుణులు. డైట్ కూడా నియంత్రణలో ఉండాలి. శరీరంలో అవసరం కంటే ఎక్కువ కేలరీలు చేరితే అవి కాస్తా కొవ్వులా మారతాయి. ఫలితంగా స్థూలకాయం కలుగుతుంది. అందుకే తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఏది మంచిది , ఏది కాదనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి.

యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే. యాపిల్ విషయంలో ఇది అందరికీ తెలిసిందే. అయితే యాపిల్ అనేది కేవలం ఆరోగ్యపరంగానే కాదు..శారీరకంగా కూడా చాలా మంచిది. యాపిల్ అనేది వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేయడమే కాకుండా బరువు సైతం నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో దోహదపడుతుంది.

పెరుగు అనేది చాలా మంది పరిష్కారం. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే పెరుగు తీసుకుంటే ఎక్కువసేపు ఆకలేయదు. తీపి తినాలనే కోరికను కూడా అణచివేస్తుంది. ఫలితంగా అన్‌హెల్తీ ఫుడ్‌కు దూరంగా ఉంటారు. బరువు తగ్గించుకోవాలంటే పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవాలి. 

బరువు తగ్గించుకునేందుకు గుడ్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్లు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే చాలాసేపు కడుపు నిండుగా ఉండి ఆకలేయదు. అవసరానికి మించి తినరు. అందుకే గుడ్లు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

Also read: World Hypertension Day 2023: మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More