Home> హెల్త్
Advertisement

Diabetic Diet Tips: డయాబెటిస్ రోగులు ఏ పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదు

Diabetic Diet Tips: డయాబెటిస్. ఇటీవలి కాలంలో ప్రధాన సమస్య. కేవలం ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా కచ్చితంగా నియంత్రించుకోగలిగే వ్యాధి. మరి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని పండ్లు తినకూడదని తెలుసా..

Diabetic Diet Tips: డయాబెటిస్ రోగులు ఏ పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదు

Diabetic Diet Tips: డయాబెటిస్. ఇటీవలి కాలంలో ప్రధాన సమస్య. కేవలం ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా కచ్చితంగా నియంత్రించుకోగలిగే వ్యాధి. మరి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్ని పండ్లు తినకూడదని తెలుసా..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఏదా వ్యాధి లేదా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ముందుగా పండ్లు తినడం అలవాటు చేసుకుంటాం. వైద్యులు కూడా పండ్లు తినమనే సలహా ఇస్తుంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ కాదు. డయాబెటిస్ వ్యాధి విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. కొన్ని రకాల పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇవి శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి. డయాబెటిక్ రోగులు ఏయే రకాలపండ్లు తినకూడదో చూద్దాం...

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు డయాబెటిస్ అధికమౌతుంది. మీరు తినే ఆహార పదార్ధాల ద్వారా షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు నియంత్రణ కష్టమే. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉంటేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా కొన్నిరకాల పండ్ల విషయంలో దూరం పాటించాలి. పండ్ల గ్లైసోమిక్ ఇండెక్స్ 100 నుంచి 70 మధ్య ఉంటే ఆ పండ్లు లేదా కూరగాయలు తినకూడదు. డయాబెటిస్ ఉన్నప్పుడు గ్లైసోమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడదు.

ఏ పండ్లు తినకూడదు

పుచ్చకాయ, ఎండి రేగుపండ్లు, పైనాపిల్, అరటిపండ్లు, బత్తాయి, కిస్‌మిస్, ద్రాక్ష, ఖర్జూరం వంటి స్వీట్‌నెస్ ఎక్కువగా ఉండే పండ్లలో గ్లైసోమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది. వీటిని దూరం పెట్టాలి.

ఇక కూల్‌డ్రింక్స్, వైట్ బ్రెడ్, వైట్ రైస్, బంగాళ దుంపలో కూడా గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. గ్లైసోమిక్స ఇండెక్స్‌తో పాటు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆహారం కూడా తినకూడదు. మామిడి, ద్రాక్ష, యాపిల్, అరటి పండ్లలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి.

ఏ పండ్లు తినవచ్చు

ఆలు బుఖారా, కివీ, నేరేడు పండ్లలో గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నప్పుడు ఇవి తినవచ్చు. పండ్లలో సహజంగానే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుందనే కారణంగా మొత్తానికి తినడం మానేస్తుంటాం. కానీ ఇది మంచి పద్ధతి కాదు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా..పరిమితంగా తీసుకుంటే ఏ నష్టం ఉండదు.

Also read: Morning Good Habits: ఆ నాలుగు అలవాట్లుంటే చాలు..చర్మం, కేశాలకు నిగారింపు ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More