Home> హెల్త్
Advertisement

Headache in Summer: ఎండల కారణంగా విపరీతమైన తలనొప్పి వస్తుందా.. అయితే ఇలా చేయండి!

Headache in Summer: వేసవిలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలోని నరాలు వ్యాకోచించి.. వెంటనే తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా వచ్చే తలనొప్పి నివారించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Headache in Summer: ఎండల కారణంగా విపరీతమైన తలనొప్పి వస్తుందా.. అయితే ఇలా చేయండి!

Headache in Summer: వేసవిలో ఎండలు పెరిగేకొద్దీ చాలా మంది అనేక అనారోగ్యాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల మూలంగా చాలా మంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. వేడికి తలలోని నరాలు వ్యాకోచించడం వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మార్గాలను వెతకాలి. 

తలనొప్పి నివారణకు చర్యలు

మీకు తలనొప్పిగా ఉంటే.. మీరు మొదట వెతకాల్సింది, ట్యాబ్లెట్ లేదా జండు బామ్ కాదు. తలనొప్పితో బాధపడే వారు ముందుగా.. ఓ టంబ్లర్ లో నీరు తీసుకొని తాగాలి. దీంతో పాటు టీ లేదా కాఫీ తాగడం వల్ల అధిక తలపోటు నుంచి బయటపడొచ్చు. అంతే కాకుండా వేసవిలో చల్లని పానీయాలు తాగడం వల్ల కూడా శరీరానికి తగిన నీటి శాతం అందిన క్రమంలో

తలనొప్పిని నివారించుకోవచ్చు. 

అలాగే, రాత్రిపూట నిద్రపోకుండా సెల్ ఫోన్ యూజ్ చేయడం మానుకోవాలి. అలా చేయడంతో కంటి నరాలు దెబ్బతిని వెంటనే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతమైన నిద్ర, పౌష్టికాహారం, తగినంత తాగునీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. వేసవిలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ప్రయత్నించండి. అలా వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్, గొడుగు తప్పక తీసుకెళ్లండి.  

Also Read: Hair Treatment Tips: జుట్టు రాలడం సహా తెల్లజుట్టు సమస్యను తగ్గాలంటే ఇలా చేయండి!

Also Read: Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలతో శరీరానికి ఉపయోగాలు ఎన్నో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More