Home> హెల్త్
Advertisement

Hair Fall Treatment: రోజూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే జుట్టు ఎప్పటికీ రాలిపోదు!

Hair Fall Treatment: సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో జుట్టు రాలడం లేదా జుట్టు తెల్లబడడం వంటి సమస్యలను వస్తాయి. కానీ, ఈ సమస్యలు ఇప్పుడు యువకులలోనూ తలెత్తుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు రాలే సమస్య అధికగమైంది. దీని నివారణకు సంబంధించిన చిట్కాలను తెలుసుకుందాం. 
 

Hair Fall Treatment: రోజూ ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే జుట్టు ఎప్పటికీ రాలిపోదు!

Hair Fall Treatment: జుట్టు రాలడమనే సమస్యను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. మారుతు జీవనశైలి కారణంగా జుట్టు రాలడం అనేది సాధారణంగా మారిపోయింది. చిన్నా, పెద్ద అనే వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను పూర్తిగా రూపుమాపేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మేలు జరుగుతుంది. 

జుట్టు రాలడానికి ప్రధాన కారణం?

చిన్నా, పెద్దా అనే వయసులతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అయితే అందుకు కారణమేంటో తెలుసుకోవడం వల్ల ఆ సమస్యను రూపుమాపవచ్చు. వైద్యనిపుణుల ప్రకారం.. శరీరంలోని కండరాలు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉప్పు చాలా అవసరం. అయితే ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు లేదా హార్ట్ స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆహారంలో ఉప్పు తగ్గించడం మంచిది. 

ఆహారంలో ఉప్పు ఎంత మోతాదు వాడాలి?

ఒక వ్యక్తి రోజుకు 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది దాదాపు ఒక టీస్పూన్ కు సమానం. ఈ మొత్తం ఉప్పు నుంచి శరీరానికి 2.4 గ్రాముల సోడియం లభిస్తుంది. కాబట్టి రోజులో తినే ఆహారంలో ఉప్పు తగ్గించడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. 

కానీ, ఆధునిక కాలంలో మనం తినే ప్రతి పదార్థాల్లో ఉప్పు పరిమాణం కొంత ఎక్కువగానే ఉంటుంది. క్రంచీ చిప్స్, సాల్ట్ బిస్కెట్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, బ్రెడ్, పిజ్జా, శాండ్ విచ్ లు, సూప్ మొదలైన వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు మోతాదు పెరగడం వల్ల జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. 

సోడియం వల్లనే..

ఆహారంలో ఉప్పు పెరిగితే శరీరంలో సోడియం పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో అధిక సోడియం కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. దీని వల్ల క్రమంగా జుట్టు రాలిపోతుంది. అదే విధంగా ఆహారంలో ఉప్పు తగ్గకుండా చూసుకోవాలి. శరీరంలో సోడియం తగిన మోతాదులో లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంది.  

Also Read: Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పవు!

Also Read: Jackfruit Side Effects: పనస కాయ తిన్న తర్వాత ఈ పదార్ధాలు అసలు ముట్టుకోకండి! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More