Home> హెల్త్
Advertisement

H3N2 virus: హెచ్3ఎన్2 వైరస్ కూడా కొవిడ్ తరహాలోనే వ్యాపిస్తుందన్న గులేరియా

Dr Randeep Guleria About H3N2 : H3N2  వైరస్ కేసులపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ ఛైర్మన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

H3N2 virus: హెచ్3ఎన్2 వైరస్ కూడా కొవిడ్ తరహాలోనే వ్యాపిస్తుందన్న గులేరియా

Dr Randeep Guleria About H3N2 : H3N2  వైరస్ కేసులపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ ఛైర్మన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోందని.. అలాగే బిందువులు, తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని అన్నారు. అన్నింటికిమించి H3N2 వైరస్ కూడా కొవిడ్-19 వలే వ్యాప్తి చెందుతుందని హెచ్చరించిన డా గులేరియా.. వయస్సులో పెద్ద వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని అన్నారు.

ప్రస్తుతం ఇన్‌ఫ్లూయెంజా కేసుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, గొంతు నొప్పి, శరీరం నొప్పులు, ముక్కు నుంచి నీరు కారటం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. "గతంలో వచ్చిన H1N1 వైరస్ ఇప్పుడు H3N2 రూపాంతరం చెందింది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే జనం సులభంగా ఈ వైరస్ ఇన్ ఫెక్షన్ బారిన పడతారని డా గులేరియా హెచ్చరించారు. బిందువులు, తుంపర్ల ద్వారా వ్యాపిస్తున్న ఈ వైరస్ కేసుల సంఖ్య భారీగానే పెరుగుతూ వస్తున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య అంత ఎక్కువగా లేదు అని డా గులేరియా గుర్తుచేశారు. 

ఇప్పుడు మాస్క్‌లు ధరించకుండా బయట స్వేచ్ఛగా తిరిగే స్థితికి తిరిగి చేరుకున్నాం. కానీ రద్దీ ప్రదేశంలోనూ కొవిడ్-19 నిబంధనలు లేకుండా తిరుగుతుండటమే వైరస్ మరింత సులభంగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతోంది అని డా గులేరియా ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. తిరిగి కొవిడ్-19 తరహా నిబంధనలు పాటిస్తే.. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇది కూడా చదవండి : Curd For Diabetes Patients: షుగర్ పేషెంట్స్ పెరుగు తినొచ్చా ? తింటే ఏమవుద్ది ?

ఇది కూడా చదవండి : Adenovirus: కరోనా తరువాత మరో వైరస్, పశ్చిమ బెంగాల్ 36 మంది చిన్నారులు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More