Home> హెల్త్
Advertisement

Green Tea Side Effects: అతిగా గ్రీన్‌ టీలను తాగడం మంచిదేనా? తాగడం వల్ల ఏం జరుగుతుంది!

Side Effects Of Green Tea: అతిగా గ్రీన్‌ టీలను తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

Green Tea Side Effects: అతిగా గ్రీన్‌ టీలను తాగడం మంచిదేనా? తాగడం వల్ల ఏం జరుగుతుంది!

 

Side Effects Of Green Tea: శరీర బరువును తగ్గించుకోవడాని, కొలెస్ట్రాల్‌ను కరింగించుకోవడానికి చాలా మంది ఎక్కువగా గ్రీన్‌ టీలను తాగుతూ ఉంటారు. ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిన, అతిగా తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీని అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర జీర్ణక్రియ సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రీన్‌ టీని అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గ్రీన్ టీ తగిన మోతాదులో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అధిక పరిమాణంలో పాలీఫెనాల్స్, క్యాటెచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మధుమేహం కూడా నియంత్రిణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ఈ టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తుంది.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

కాలేయ సమస్యలతో బాధపడేవారు గ్రీన్‌ టీని తాగొచ్చా?:
గ్రీన్ టీని అతిగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలోని కాటెచిన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగే వారిలో కాలేయం ప్రభావితమవుతుంది. దీంతో పాటు కొందరిలో అవయవాలు దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రోజుకు ఎన్ని సార్లు గ్రీన్ టీ తాగాలో తెలుసా?:
శరీర బరువును నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతి రోజు రెండు కప్పుల చొప్పున తీసుకోవడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మించి తాగితే తీవ్ర అనారోగ్య సమస్యల రావచ్చు. అయితే ఈ టీలను ఎక్కువగా తాగాలనుకునేవారు వైద్యుల సలహాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అతిగా ఈ టీని తాగాల్సి ఉంటుంది.  

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More